Amigos Movie Review : నందమూరి కల్యాణ్ రామ్ నటించిన బింబిసార మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో కల్యాణ్ రామ్ ద్విపాత్రాభినయంలో నటించి అలరించాడు. ఈ మూవీ భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీని ప్రేక్షకులు ఆదరించారు. ఈ మూవీతో చాలా ఏళ్ల తరువాత మళ్లీ కల్యాణ్ రామ్ సక్సెస్ ట్రాక్‌లోకి ఎక్కాడు. ఇక ఇదే ఉత్సాహంతో కల్యాణ్ రామ్ మరో భిన్నమైన మూవీతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన నటించిన అమిగోస్ మూవీ ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీతో కల్యాణ్ రామ్ మళ్లీ సక్సెస్ సాధించాడా.. సినిమా కథ ఎలా ఉంది.. ఆకట్టుకుంటుందా.. లేదా.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కథ..
సిద్ధు అలియాస్ సిద్ధార్థ్ (కల్యాణ్ రామ్) ఇషిక (ఆషిక రంగనాథ్) అనే ఆర్‌జే తో ప్రేమలో పడతాడు. అయితే తనను పెళ్లి చేసుకోవాలంటే ఆమె కొన్ని షరతులను విధిస్తుంది. దీంతో వాటిని సాధించడం సిద్ధుకు సవాల్‌గా మారుతుంది. ఇక తనలాగే ఉండే మరో ఇద్దరు వ్యక్తులు మంజునాథ్ హెగ్డె (కల్యాణ్ రామ్), మైకేల్ (కల్యాణ్ రామ్)లను సిద్ధు కలుసుకుంటాడు. ఇక వారి ద్వారా సిద్ధు తన సమస్యలను ఎలా సాల్వ్ చేసుకున్నాడు..? అనేదే చిత్ర కథ.
విశ్లేషణ..
బింబిసారలో కల్యాణ్ రామ్ రెండు పాత్రల్లో అలరించగా.. ఇందులో ఆయన మూడు పాత్రలను పోషించారు. అందువల్ల మూడు వేరియేషన్లను చూపించేందుకు వీలు కలిగింది. ఇక మూడు పాత్రల్లోనూ కల్యాణ్ రామ్ అద్భుతంగా నటించాడనే చెప్పాలి. అలాగే హీరోయిన్ ఆషిక రంగనాథ్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే ఇతర నటీనటులు కూడా తమ పాత్రల పరిధుల మేర బాగానే నటించారు. ఇక ఈ మూవీకి రాజేంద్ రెడ్డి కథను అందించడంతోపాటు దర్శకత్వం కూడా వహించారు. ఇది వరకు ఎన్నడూ చూడని ఓ భిన్నమైన చిత్రాన్ని ఆయన ప్రేక్షకులకు అందించారనే చెప్పాలి. అందువల్ల సినిమా చూడాలనే ఆసక్తి కలిగిస్తుంది.
అయితే సినిమాలో చిన్న పాటి థ్రిల్స్ ఉండడం, రొమాంటిక్ ట్రాక్, కల్యాణ్ రామ్ భిన్నమైన పాత్రల్లో కనిపించడం వంటివన్నీ అలరిస్తాయి. ఇవన్నీ ప్లాస్ పాయింట్స్. కానీ సినిమాలో మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఏం జరుగుతుందో ముందే తెలిసిపోవడం, క్లైమాక్స్ చప్పగా అనిపించడం, కామెడీ లేకపోవడం వంటివన్నీ మైనస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. అయితే భిన్నమైన కథను కోరుకునే వారు మాత్రం ఒక్కసారి ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు. కచ్చితంగా అలరిస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…