మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠీలు డేటింగ్‌లో ఉంటున్నారంటూ సోషల్ మీడియాలో కొన్నాళ్లుగా తెగ వార్తలు హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోనున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఇంత జరుగుతున్నా అటు వరుణ్ కానీ, లావణ్య కానీ ఈ వార్తలపై ఒక్కసారి కూడా స్పందించకపోవడం విశేషం. ఆ మధ్య లావణ్య, వరుణ్ తేజ్ కలిసి ఓ ప్రైవేట్ పార్టీలో పాల్గొనడంతో చర్చనీయాంశం అయ్యింది. కామన్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వీరిద్దరూ హాజరు కాగా, ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందనే టాక్ నడిచింది.
వరుణ్ తేజ్ , లావణ్య గతంలో మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే వాదన అయితే ఉంది. తాజాగా లావణ్య త్రిపాఠి చేసిన కామెంట్స్ తో వీరిద్దరి మధ్య రిలేషన్‌పై ఆసక్తికర చర్చ నడుస్తుంది.లావణ్యత్రిపాఠి తాజాగా `పులిమేక` అనే చిత్రంలో నటిస్తుండగా, ఇందులో బిగ్ బాస్ సిరి కూడా ఇందులో యాక్ట్ చేసింది. ఈ టీమ్ సుమ యాంకర్‌గా చేస్తున్న `సుమా అడ్డా` షోలో పాల్గొన్నారు. వీరితో సుమ గేమ్‌లు ఆడిస్తూ, ప్రశ్నలు సందిస్తూ, ఆడియెన్స్ తో డైలాగులు చెప్పిస్తూ ఆద్యంతం నవ్వులు కూడా పూయించింది.
అనంతరం లావణ్య త్రిపాఠిని ప్రశ్నించింది యాంకర్ సుమ. మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరని అడితే మీరు ఎవరి పేరు చెప్తారు అంటూ ఏ-నాని, బీ-వరుణ్ తేజ్ పేర్లు చెప్పగా, దానికి లావణ్య త్రిపాఠి రియాక్ట్ అవుతూ, వరుణ్ తేజ్ పేరు చెప్పింది. వరుణ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అని ఆమె తన మనసులోని మాటని చెప్పడంతో సుమతోపాటు కోనవెంకట్, సిరిలు కూడా అవాక్కయ్యారు. దీంతో అక్కడ ఉన్న ఆడియన్స్ సైతం హో వేసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ పై లావణ్యకి అంత ప్రేమ ఉంది కాబట్టి ఆమె ఈ విషయాన్ని ఇలా తెలిపిందని చర్చలు జరుపుతున్నారు. ఇందులో నిజానిజాలేంటనేది రానున్న రోజులలో తేలనుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…