జీవితంలో ఎన్నో సాధించాల్సిన తారకరత్న ఊహించని విధంగా ఫిబ్రవరి 18న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో నందమూరి ఫ్యామిలీ దిగ్భ్రాంతికి గురైంది. తారకరత్న లేని లోటుని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. కొద్ది సేపటి క్రితం తారకరత్న అంత్యక్రియలు పూర్తిగా, ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. ఇక తారకరత్న మృతి కారణంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తారకరత్న మృతి కారణంగా ఎన్టీఆర్ 30 చిత్ర ప్రారంభోత్సవం మరోసారి వాయిదా వేస్తూ తారక్ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 24న ఎన్టీఆర్ 30 ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇంతలో తన సోదరుడు తారకరత్న మృతితో నందమూరి ఫ్యామిలీ విషాదంలో మునిగిపోయింది.
అమిగోస్ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ తన 30వ సినిమా గురించి స్వయంగా మాట్లాడుతూ.. ఫ్యాన్స్ ఇలా దర్శకులపై ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదు అని.. వారికి కొంత సమయం ఇవ్వాలని ఫ్యాన్స్ ని రిక్వస్ట్ చేశాడు. ఏది ఏమైనా ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో లాంచ్ చేయబోతున్నామని తారక్ ఖరారు చేశాడు. ఎన్టీఆర్ 30 మూవీని 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితూ తారకరత్న మరణంతో సినిమా ప్రారంభ కార్యక్రమం వాయిదా పడిందని, సినిమా లాంఛింగ్ కొత్త తేదీని సరైన సమయంలో ప్రకటిస్తామని మేకర్స్ వెల్లడించారు.
ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. భారీ సినిమాలతో నందమూరి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా అడుగులేస్తున్నారనే చెప్పాలి.. ఇందులో భాగంగానే స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో కమిటయ్యారు ఎన్టీఆర్. ఈ సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఎన్టీఆర్- కొరటాల శివ కాంబో మూవీ సెట్స్ మీదకు రాబోతోంది. నిజానికి ఈ సినిమాను ఎప్పుడో అధికారికంగా అనౌన్స్ చేసినప్పటికీ ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుండటం నందమూరి అభిమానుల్లో నిరాశ నింపుతోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…