Lakshmi Pranathi : ఒకప్పుడు స్టార్ హీరోల సతీమణులు మీడియాకి చాలా దూరంగా ఉండేవారు. కొందరు హీరోల భార్యలు ఎలా ఉంటారో కూడా తెలియదు. కాని ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం వలన ఇండస్ట్రీలోని హీరోల అందరి భార్యలు సినీ ప్రేక్షకులు సుపరిచితం. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి అందరికీ సుపరిచితమే.ఎన్టీఆర్ కు ఖాళీ టైం దొరికితే ఫ్యామిలీతోనే ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన ఫ్యామిలీతో ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటాడు. ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఈ జంట న్యూయార్క్ నగరంలో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలో ఎన్టీయార్ 30 సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న వేళ, ఈ లోపు కాస్త అలా అలా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు ఎన్టీయార్.
ఇటీవల ఎన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలో శ్రీమతి ప్రణతీతో ఉన్నారు. ఒక రెస్టారెంటులో చాలా మంది మధ్యలో ప్రేమగా కౌగిలించుకున్న ఫోటో అది. దానికి మూడు రెడ్ హార్ట్ లవ్ సింబల్ ఎమోజీలు పోస్ట్ చేశారు. ఫోటో కొంచెం క్లారిటీగా లేదు గానీ… అందులో ఎన్టీఆర్ ప్రేమ మాత్రం క్లారిటీగా కనబడుతోంది. ఇది చూసిన నందమూరి అభిమానులు తె గ మురిసిపోయారు. ఇక తాజాగా ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతికి సంబంధించిన పిక్ ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. ఇందులో లక్ష్మీ ప్రణతి లుక్ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.
చుట్టూ షాపింగ్ మాల్స్ లైటింగ్ జిలుగు వెలుగుల మధ్య న్యూయార్క్ వీధుల్లో ఫోటోకి పోజిచ్చారు ఎన్టీయార్ దంపతులు. ఇందులో లక్ష్మీ ప్రణతి చాలా స్టైలిష్ లుక్ లో ఉంది. కాగా, ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల్ని లండన్‌లోనే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది, న్యూ ఇయర్ వేడుకలు పూర్తయ్యాకే హైద్రాబాద్‌లో ల్యాండ్ అవ్వనున్నారట ఈ దంపతులు. కొత్త సంవత్సరంలో కొత్త సినిమాపై ఎన్టీయార్ ఫోకస్ పెట్టనున్న సంగతి తెలిసిందే. చివరిగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఎన్టీఆర్‌కి పాన్ ఇండియా స్టార్ డమ్ లభించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…