Balakrishna : నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్నాళ్లు స్టార్ హీరోగా అదరగొట్టిన ఆయన ఇప్పుడు హోస్టుగా వ్యవహరిస్తున్నారు. బాలకృష్ణ హోస్టింగ్‌తో అన్‌స్టాపబుల్ షో సీజన్ 2 క్రేజీగా మారింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గెస్టుగా రాబోతున్న ఎపిసోడ్‌ను ఆహా ఓటీటీ గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఇందుకోసం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వేదికగా మారింది. అక్కడ అల్లు అరవింద్, బాలకృష్ణ, అన్ స్టాపబుల్ క్రూ సభ్యులు మొత్తం పవన్ కోసం ఎదురుచూస్తున్నారు. పవన్ కల్యాణ్- బాలయ్యను చూసేందుకు అభిమానులు సైతం పెద్ద ఎత్తున పోటెత్తారు.
వారిలో నుంచి ఒక అమ్మాయి మామయ్య అంటూ కేక వేసింది. దాంతో బాలకృష్ణ ఒక్కసారి గా అభిమానుల వైపు తిరిగాడు. ఆ చిన్నారిని తీసుకురండి అంటూ సైగ చేశాడు. దాంతో చిన్నారి తండ్రి ఆమెని తీసుకొని బాలయ్య దగ్గరకు వెళ్లాడు. అప్పుడు చిన్నారిని దగ్గరకు తీసుకుని బాలయ్య దగ్గరకు వెళ్లగా, ఆమె పేరేంటని అడిగి పలకరించాడు. ఆ చిన్నారికి ఒక ముద్దుపెట్టి ఆశీర్వదించి పంపాడు. ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్స్ బాలయ్య మంచి మనసుకు ఫిదా అయిపోయారు. అది సార్ బాలకృష్ణ అంటే అంటూ ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు.
ఇక ఈ రోజు బాలకృష్ణ- పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఎపిసోడ్ జరుగుతుంది. పవన్ కు అల్లు అరవింద్, బాలయ్య పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. పవన్- బాలయ్య ఒకరినొకరు ఆప్యాయంగా హత్తుకున్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఎపిసోడ్ ని సంక్రాంతి స్పెషల్ గా విడుదల చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ ఎపిసోడ్ లో బాలయ్య- పవన్ కల్యాణ్ ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు.. అందుకు పవన్ కల్యాణ్ ఎలాంటి సమాధానాలు చెబుతారు అని జోరున చర్చ నడుస్తుంది. ఈ షో కోసం మెగా అభిమానులతో పాటు నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…