Lagadapati Rajagopal : మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆంధ్రా అక్టోపస్ గా పేరుగాంచారు. ఆయన ఎంత ఫేమసో.. ఆయన సర్వేలు కూడా అంతే ఫేమస్ అవుతున్నాయి. ప్రతి ఎన్నికల సమయంలోనూ తనదైన శైలిలో జోస్యం చెప్పడం రాజగోపాల్‌కి అలవాటుగా మారింది. ఎన్నికల ఫలితాలపై లగడపాటి చేయించిన సర్వే 99 శాతం ఖచ్చితత్వంతో కూడుకుని ఉంటాయనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. ఏపీలో రానున్న ఎన్నికలు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీతో పాటుగా జనసేనకు కూడా ప్రతిష్ఠాత్మకంగా మారాయి. సీఎం జగన్ వైనాట్ 175 నినాదంతో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు.
పవన్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనీయను అంటూ అంటూ టీడీపీ, బీజేపీని తిరిగి కలిపేందుకు ప్రతిపాదనలు చేసారు. మూడు పార్టీలు కలిసి 2014 ఎన్నికల తరహాలో జగన్ ను ఓడిస్తామని చెబుతున్నారు. ప్రయోగాలు ఉండవని తేల్చి చెప్పారు. పవన్ ప్రతిపాదన పైన బీజేపీ నిర్ణయం ఏంటనే చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తో సమావేశమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పొత్తుల పైన చర్చ జరిపినట్టు ఇన్‌సైడ్ టాక్. అయితే ఓ ఇంటర్వ్యూలో టీడీపీ జనసేన పొత్తు ప్రభావంపై లగడపాటిని ప్రశ్నించగా… ఆయన పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
“సాధారణంగా.. చిన్న పార్టీలు తమ ఓట్లను పెద్ద పార్టీలకు సులభంగా ఓటు బదిలీ చేస్తాయి. కానీ పెద్ద పార్టీల ఓట్లు చిన్న పార్టీలకు రావడం అనేది కష్టం. కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఇదే సమస్య ఎదురైంది’ అని లగడపాటి అన్నారు. జనసేన నుంచి టీడీపీకి ఓటు బదిలీ ఈజీ అయితే టీడీపీ నుంచి జనసేనకు ఓట్ల బదిలీ అనేది కష్టమని లగడపాటి చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. వీటిపై మాజీ ఎంపీలు కూడా సర్వేలు చేస్తూనే ఉన్నారు. 2019లో తన సర్వేలో ఏమి తప్పు జరిగిందో కూడా మరోసారి క్లారిటీ ఇచ్చారు. విభజన తర్వాత పెద్దగా యాక్టివ్‌గా లేను..అప్పట్లో ప్రజల్లో ఉండటం వల్ల నా మునుపటి సర్వేలు సరైనవని భావిస్తున్నాను “అని ఆయన అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…