ఈ రోజుల్లో చావు ఎప్పుడు ఎలా వస్తుందనేది చెప్పడం కష్టంగా ఉంది.మనదారిన మనం వెళుతున్నా కూడా ఏదో ఒక రూపంలో మృత్యువు కబళిస్తుంది. ఇటీవలి కాలంలో చాలా మంది రోడ్ యాక్సిడెంట్ ద్వారానో లేదంటే గుండె పోటుతోనో కన్నుమూస్తున్నారు. తాజాగా ఓ పెళ్లింట గుండెపోటుతో ఇద్దరు నవ దంపతులు మరణించడం కలకలం రేపుతుంది. విధికి కన్నుకుట్టిందేమో తెలియదు కాని మూడుముళ్లతో ఒక్కటై గంటలు కూడా గడవక ముందే ఇద్దరు గుండెపోటుతో కన్నుమూసారు. ఈ విషాద ఘటనతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రెయిచ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ప్రతాప్ యాదవ్(24), పుష్ప (22)కు మే నెల 30న వివాహం జరిగింది. బారాత్ జరిగిన తర్వాతి రోజు పెళ్లికొడుకు ఇంట్లో శోభనం ఏర్పాటు చేశారు. దీంతో ఆ కొత్త జంట రాత్రి వారి రూంలోకి వెళ్లగా, మర్నాడు ఉదయం ఎంత సేపయినా బయటకు రాలేదు. బంధువులు తలుపులు బద్దలుకొట్టి చూడగా బెడ్‌పై ప్రతాప్, పుష్ప విగత జీవులుగా కనిపించారు. దీంతో ఒక్కసారిగా ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. ఇద్దరూ మంచంపై విగతజీవులుగా పడి ఉండటంతో ఏం జరిగిందో తెలియక కుటుంబసభ్యులు షాకయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, ఇద్దరి మృతికి గుండెపోటు కారణమని పోస్టుమార్టంలో వెల్లడైనట్టు బహ్రైచ్ జిల్లా ఎస్పీ ప్రశాంత్ వర్మ వెల్లడించారు. తదుపరి పరిశీలన కోసం మృతదేహాలను లక్నోలోని స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపినట్టు చెప్పారు. స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం నవదంపతులు నిద్రపోయిన గదిలో వెంటిలేషన్ లేదని, ఈ క్రమంలో ఊపిరాడక కార్డియాక్ అరెస్ట్‌కు గురయి ఉంటారని చెబుతున్నారు. పెళ్లైన మర్నాడు పుష్ప, ప్రతాప్‌లకు మొదటి రాత్రి కావడంతో వారిని ఓ గదిలోకి పంపి.. కుటుంబసభ్యులు వేరే గదుల్లో నిద్రపోయినట్టు చెబుతున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…