Kushi Movie Public Talk : ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ సంయుక్తంగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ఖుషి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు జంటగా నటించిన క్లీన్ రొమాంటిక్ కామెడీ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా మ్యూజికల్‌గా హిట్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మురళీ శర్మ, సచిన్ ఖేడ్కర్, జయరాం, శరణ్య, రోహిణి, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్ లాంటి యాక్టర్లు ప్రధాన పాత్రలతో సినిమాకు బలంగా మారారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ భారీగాన పెరిగిపోయింది. ఖుషి మూవీని దాదాపు 100 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు.
ఖుషి మూవీకి రిలీజ్ ముందు భారీగా బజ్ క్రియేట్ కావడంతో భారీగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు. నైజాంలో 300 స్క్రీన్లు, సీడెడ్‌లో 200 స్క్రీన్లు, ఆంధ్రాలో 400 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 900 స్క్రీన్లలో రిలీజ్ చేయడం జరిగింది. ఇక కర్ణాటక 120 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 500 స్క్రీన్లలో రిలీజ్ చేవారు. దాంతో మొత్తంగా సుమారు 550 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్… వాళ్ళిద్దరి నటన… సన్నివేశాలకు ప్రాణం పోసింది. ‘ఖుషి’ ప్రథమార్థం అంతా సరదాగా సాగుతుంది. ప్రేమ కోసం, ప్రేమను వ్యక్తం చేయడం కోసం పరితపించే యువకుడిగా విజయ్ దేవరకొండ చేసిన సీన్లు నవ్విస్తాయి.
ద్వితీయార్థంలో ఆలుమగల మధ్య అసలు కథ, కథలో కాన్‌ఫ్లిక్ట్ మొదలయ్యాయి. టీవీ డిబేట్ గానీ, కేరళ ఎపిసోడ్ గానీ అంత ఆసక్తిగా అనిపించవు. నిడివి పెంచిన ఫీలింగ్ తీసుకొచ్చాయి. అయితే… విజయ్ దేవరకొండ, సమంత స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారీ మేజిక్ వర్కవుట్ అయ్యింది. విప్లవ్, ఆరాధ్య… ఈ పాత్రలు విజయ్ దేవరకొండ, సమంతకు సవాల్ విసిరేవి కాదు. అయితే… హీరో హీరోయిన్లు ఇద్దరూ తమ నటనతో పాత్రలను చూడబుల్‌గా చేశారు. యువత ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే కాసేపు సరదాగా ఎంజాయ్ చేయవచ్చు. చిన్నపాటి సందేశాన్ని సున్నితంగా చెప్పే ప్రయత్నం చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…