Bro Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలసి నటించిన బ్రో చిత్రం జూలై 28న రిలీజైన సంగతి తెలిసిందే. తమిళ హిట్ చిత్రం వినోదయ సీతం రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ సంపాదించింది. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో పర్వాలేదు అనిపించినా తర్వాత కంప్లీట్ గా స్లో డౌన్ అయిపోయి భారీ నిరాశ పరిచే కలెక్షన్స్ తోనే పరుగును పూర్తి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. సినిమా థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకుని…రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ ను నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది.
బజ్ లేకుండా విడుదలైన ఈ చిత్రానికి క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. పవన్ కళ్యాణ్, తేజు ప్రధాన పాత్రల్లో నటించగా.. కేతిక శర్మ, ప్రియా వారియర్ కీలక పాత్రల్లో నటించారు. థియేటర్స్ లో ఈ చిత్రం నిరాశపరచడంతో ఓటిటిలోకి త్వరగానే విడుదల చేశారు. నెట్ ఫ్లిక్స్ లో ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఇండియాలో ట్రెండింగ్ లో 1 వ స్థానంలో కొనసాగుతోంది. ఓటిటిలో ఈ చిత్రానికి స్టన్నింగ్ రెస్పాన్స్ వస్తోంది. ఓటిటి వేదికగా ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ మూవీ పాకిస్తాన్ లో సైతం టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుండడం విశేషం. పాక్ లో బ్రో మూవీ 8 వ స్థానంలో ట్రెండ్ అవుతోంది.
బంగ్లాదేశ్ లో సైతం బ్రో చిత్రం ట్రెండింగ్ లో 8వ స్థానంలో ఉండడం విశేషం. వాస్తవానికి బ్రో చిత్రానికి థియేటర్స్ లో డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో ఫ్యాన్స్ అంచనాలు అందుకునే స్థాయిలో ఈ మూవీ లేకపోవడం వల్లే వసూళ్లు రాబట్టలేకపోయిందని విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా బ్రో చిత్రం ఓటిటిలో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటుండడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి చనిపోయిన కుటుంబానికి పెద్ద కొడుకు అయిన సాయిధరమ్ తేజ్ అన్నీ చూసుకుంటుంటాడు. ప్రమాదంలో అతడు మరణించడం.. కాల దేవుడు ప్రత్యక్షమై 90 రోజుల్లో జీవిత సత్యాన్ని ఎలా వివరించాడు అనే నేపథ్యంలో విడుదలైన మూవీ ఇప్పుడు అదరగొడుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…