Samantha : టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ నాగ చైతన్య- సమంత డివోర్స్ ఇష్యూ ఎప్పటికీ మీడియాలో హాట్ టాపికే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జోడీ విడాకులు తీసుకొని సడెన్ షాకిచ్చారు. అయితే ఈ విడాకులకు కారణాలేంటి? వాళ్ళు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనే దానిపై ఓ రేంజ్ చర్చలు నడిచాయి. నాగ చైతన్య- సమంత పెళ్లి బంధం నిలవకపోవడానికి అసలు కారణం గ్రహాలు అనుకూలించకపోవడమే అన్నారు వేణు స్వామి. వీళ్లిద్దరి జాతకంలో శని ఉచ్ఛ స్థితిలో ఉందని, అందుకే వీళ్లు కలిసి ఉండలేరు అని ముందే చెప్పానని అన్నారు. ఇలా ఉన్న జాతకస్తులకు రెండు, మూడు పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఇటీవల సమంత నటించిన ఖుషి చిత్రం విడుదల కానుండగా, మూవీ ప్రమోషన్స్ శరవేగంగా సాగతున్నాయి. ఇటీవల ఖుషి ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఒకటి రిలీజ్ చేశారు. అందులో సమంత కాస్త నవ్వుతూనే సరదాగా కనిపించింది. కానీ పెళ్లి టాపిక్ వచ్చే సరికి తన అభిప్రాయాన్ని చెప్పలేకపోయింది. సైలెంట్‌గా ఉండిపోయింది. కానీ సుమ, విజయ్, రాజీవ్ కనకాల మాత్రం పెళ్లి గురించి తలా ఒక అభిప్రాయాన్ని సీరియస్ గానో, సరదాగానో చెప్పుకొచ్చారు. అందరినీ మీ జీవితాల్లో ఖుషి ఏంటి అని సుమ అడుగుతూ వెళ్లింది. విజయ్ తన లైఫ్‌లో ఖుషి అంటే.. తన ఫ్యామిలీ, మ్యారేజ్ అంటూ ఇలా చెప్పుకుంటూ పోయాడు. అయితే ప్రతీ ఒక్కరూ కూడా పెళ్లి ఎందుకు? ఇప్పుడు సంతోషంగానే ఉన్నావ్ కదా? పెళ్లి చేసుకోవడం నీకు అవసరమా? అన్నట్టుగా సలహాలు ఇస్తూనే ఉన్నారట.
అలా విజయ్ మాట్లాడుతూ ఉంటే.. మధ్యలో రాజీవ్ కనకాల కౌంటర్ వేశాడు. పెళ్లి కొంతకాలమే బాగుంటుందని కౌంటర్లు వేశాడు.ఆ పక్కనే ఉన్న సుమ ఇంకో కౌంటర్ వేసింది. ఏం పర్లేదు విజయ్.. పెళ్లి చేసుకోమనే నేను సలహా ఇస్తాను.. నువ్వొక్కడివే ఎందుకు సంతోషంగా ఉండాలి అంటూ చివర్లో పంచ్ ఇచ్చింది. ఇలా అందరూ ఏదో ఒక కౌంటర్ వేస్తుంటే సమంత మాత్రం ఏం మాట్లాడుకుండా అలా నోర్మూసుకుని ఉంది. వాళ్లు వేసే జోకులు విని నవ్వుకుంటూ ఉంది.పెళ్లి అయితే ఓ సారి ట్రై చేస్తాను అని విజయ్ అంటే.. ఏంటి? ట్రై చేస్తావా? అని సమంత నవ్వేసింది. పెళ్లిలో ట్రైలు గైలు ఉండవు.. చేసుకోవడమే అని సుమ సెటైర్ వేసింది. సమంత మాత్రం ఒక్క మాట కూడా పెళ్లి రైటో, రాంగో అని చెప్పలేకపోయింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…