రాఖీ అంటే.. అన్నా చెల్లెల్లు.. అక్కా తమ్ముడి బంధానికి ప్రతీక. హిందూ సంప్రదాయంలో ఈ పండుగకు ప్రత్యేక స్థానముంది. తమ అక్కాచెల్లెళ్లకు భరోసాగా ఉండాలని ప్రతి సోదరుడు ఆరాటం పడుతుటారు. అలాగే తమ సోదరులు ఎక్కడున్నా సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ తనకెప్పుడు రక్షణగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.రాఖీ పండగకు ఎప్పుడెప్పుడు తమ అన్నదమ్ములకు రాఖీ కట్టాలా.. అని చూస్తుంటారు అమ్మాయిలు. అలాగే ఈ చెల్లి కూడా తన అన్నకు రాఖీ కట్టాలని ఎంతో ఆరాటంతో, ఆనందంతో వేచి చూస్తుంటారు. అయాతే రాఖి రోజు జరిగినఓ సంఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరచింది.
శీతల్ భండారీ(43) హైదరాబాద్ ఆడపడుచు. పెళ్లయిన తర్వాత పుణె తరలి వెళ్లారు. అక్కడ ఆమె ఒక బొటిక్ నిర్వహించేవారు. అయితే 2017లో కాళ్లు, ముఖం వాపు రావడంతో వైద్యుల వద్దకు వెళ్లగా, పరీక్షలు చేసి కిడ్నీ సమస్య ఉందని చెప్పారు. దాదాపు ఏడాది వరకు మందులతోనే చికిత్స చేశారు. శీతల్ చెల్లెలు పూనమ్ హైదరాబాద్‌లోని అల్వాల్ ప్రాంతంలో ఉంటారు. వాళ్ల అత్తగారికి కిడ్నీ సమస్య ఉన్నప్పుడు నగరంలోని ఏఐఎన్‌యూ ఆస్పత్రిలో చూపించారు. ఆమెకు పూర్తిగా నయం కావడంతో శీతల్‌ను కూడా అక్కడే చూపిద్దామని ఆమె సూచించారు. ఇక్కడ చూపించిన తర్వాత 2020 నుంచి డయాలసిస్ మొదలైంది. కానీ బీపీ బాగా హెచ్చుతగ్గులు ఉండటం, మధ్యలో ఫిట్స్ రావడం లాంటి సమస్యలు కనిపించాయి.
మూడేళ్లు బాగా ఇబ్బంది పడ్డ ఆమెకి కొన్నాళ్లు పుణెలో, మరికొన్నిసార్లు హైదరాబాద్‌లో డయాలసిస్ చేయించేవారు. మహారాష్ట్రలోని జీవన్‌దాన్‌లో రిజిస్టర్ చేయించినా, అక్కడ సీరియల్ నంబర్ 20 ఇప్పటికీ అలాగే ఉంది తప్ప, ఏమీ కదల్లేదు. హైదరాబాద్‌లో రిజిస్టర్ చేయిద్దాం అనుకుంటే, అడ్రస్ ప్రూఫ్ మహారాష్ట్రది ఉండటంతో కుదర లేదు. దాంతో ఏఐఎన్‌యూ వైద్యులను సంప్రదించగా, కుటుంబంలోనే ఎవరైనా దానం చేస్తే కుదురుతుందని సలహా ఇచ్చారు. దాంతో శీతల్ తమ్ముడు దుష్యంత్ (37) తన అక్కకు తానే కిడ్నీ ఇస్తానని ముందుకొచ్చారు. అలా ఇస్తే తర్వాత తమ్ముడి జీవితానికి ఇబ్బంది అవుతుందని దుష్యంత పెద్ద అక్క శీతల్ ఆందోళన చెందారు. అయినా దుష్యంత్ మాత్రం పట్టు వీడలేదు. చివరకు పరీక్షలు అన్నీ కూడా సరిపోవడంతో ఏఐఎన్‌యూలో సీనియర్ నెఫ్రాలజిస్టు డాక్టర్ ఎంవీ రావు, డాక్టర్ సుజిత్ రెడ్డి సహా ఇతర వైద్యుల బృందం, యూరాలజిస్టు డాక్టర్ మల్లికార్జున బృందం అక్కాతమ్ముళ్లు ఇద్దరికీ శస్త్రచికిత్స చేసి, కిడ్నీ మార్చారు. ప్రస్తుతం అక్కాతమ్ముళ్లిద్దరూ విడిగా ఐసొలేషన్‌లో ఉంటున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…