KTR : చంద్ర‌బాబు వ‌ల్ల కంపెనీలు వ‌చ్చాయంటూ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

KTR : ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారాలు జోరుగా సాగుతున్న విష‌యం తెలిసిందే. కాంగ్రెస్‌దే అధికారం అని ఒక‌వైపు ప్ర‌చారం జ‌రుగుతున్న స‌మ‌యంలో మ‌రోవైపు బీఆర్ఎస్ మ‌ళ్లీ స‌త్తా చాట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. అయితే ఎల‌క్షన్స్ మ‌రి కొద్ది రోజుల‌లో రానుండ‌గా, కేటీఆర్ జోరుగా ప్రచార కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసీఆర్ కు గానీ తనకు గానీ ఎలాంటి కోపం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. అంతే కాకుండా చంద్రబాబు ఆరోగ్యం గురించి లోకేష్ తో మాట్లాడానని కూడా కేటీఆర్ చెప్పారు. బాబుపై కక్ష సాధించే ఆలోచనే కేసీఆర్ కు లేదని కూడా తెలిపారు. గతంలో బాబు పిలిచిన వెంటనే అమరావతికి కేసీఆర్ వెళ్లారని కేటీఆర్ గుర్తు చేశారు.

ఇక చంద్ర‌బాబు వ‌ల్ల కొన్ని కంపెనీలు వ‌చ్చాయ‌ని నేను ఇప్ప‌టికీ చెబుతున్నాను. మైక్రోసాఫ్ట్ గురించి ఓ కార్యక్ర‌మంలో మాట్లాడిన‌ప్పుడు అది మా హ‌యాంలో రాలేదు. చంద్ర‌బాబు హ‌యాంలో వ‌చ్చింద‌ని నేనే చెప్పాను. గూగుల్, అమెజాన్, యాపిల్, ప‌లు ర‌కాల సంస్థ‌లు మాత్రం మా హ‌యాంలో వ‌చ్చింద‌ని నేను చెప్పాను. క్రెడిట్ ఎవ‌రికి వ‌స్తే వారికి ద‌క్కుతుంది. ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్నే ఆశీర్వదిస్తారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో పార్ట్‌నర్స్‌ ఇన్‌ ప్రోగ్రెస్‌ ప్రోగ్రామ్‌లో మంత్రి పాల్గొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో మంచి పురోగతి సాధించామని చెప్పారు. తాము చేసిన అభివృద్ధి మీ కళ్ల ముందే కనిపిస్తోందన్నారు.

KTR interesting comments on chandra babu
KTR

హైదరాబాద్‌లో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయని మంత్రి చెప్పారు. ఈ మహానగరానికి చారిత్రకంగా గొప్ప పేరుందని అన్నారు. పాత హైదరాబాద్‌ నగరాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ ఎంతో అభివృద్ధి చెందినదని నటుడు రజినీకాంత్‌ పొగిడిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. అభివృద్ధిలో హైదరాబాద్‌ న్యూయార్క్‌తో పోటీ పడుతోందని అన్నారు.గత పదేళ్లలో నగరంలో 36 ఫ్లైవోర్లు నిర్మించామని, 39 చెరువులను నవీకరించామని మంత్రి చెప్పారు. మిషన్‌ భగీరథ కార్యక్రమంతో హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేకుండా చేశామని కేటీఆర్ తెలిపారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago