KTR : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజులలో రానుండగా, రాజకీయ నాయకులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ పలు ప్రాంతాలలో తిరుగుతూ మరోవైపు టీవీ ఛానెల్స్‌కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.తాజాగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు వయస్సు అయిపోలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒక చర్చా కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..‘‘చంద్రబాబుకు మోదీ కంటే చిన్న వయస్సు. చంద్రబాబుకు మరో పది పదిహేనేళ్లు రాజకీయం చేసే సత్తా ఉంది. శాంతిభద్రతల నేపథ్యంలోనే ఆందోళనల విషయంలో.. అది పక్క రాష్ట్రం వ్యవహారం అన్నాను అని చెప్పారు.
చంద్రబాబు అరెస్ట్ విషయంలో నా వ్యాఖ్యలు తప్పుగా జనంలోకి వెళ్లాయి. చంద్రబాబు, లోకేశ్, జగన్, పవన్‌కల్యాణ్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటా.చంద్రబాబు విషయంలో లోకేశ్ ఆవేదనను అర్థం చేసుకున్నా. చంద్రబాబు, లోకేశ్ విషయంలో మాకు సోదరభావం ఉంది’’ అని కేటీఆర్ అన్నారు. ఇక ఇదిలా ఉంటే 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేద్దామని నిర్ణయం తీసుకున్నామని మంత్రి కేటీఆర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేయాల్సిందేనని కేసీఆర్ ధృడంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. అందుకు తన మనసు ఒప్పుకోలేదని కేటీఆర్ అన్నారు. ఒకవేళ కాంగ్రెస్‌లో విలీనం అయితే రాజకీయాల నుంచి రిటైర్ అవుదామని నిర్ణయించుకున్నని.. అదే విషయం తన భార్యకి చెబితే సంతోషించిందని అన్నారు.
తెలంగాణ వస్తే చాలనుకున్నానమని.. విలీనం విషయం మాట్లాడేందుకు ఢిల్లీకి కూడా వెళ్లామని చెప్పారు. కేసీఆర్, హరీష్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీకి వెళ్లి విలీన ప్రక్రియ గురించి సోనియా గాంధీతో మాట్లాడమని చెప్పారు. అప్పుడు దిగ్విజయ్ సింగ్ తమ దగ్గరకు వచ్చి అన్ కండీషనల్‌గా పార్టీలో విలీనం చేయాలని చెప్పారన్నారు. 2006లో తాను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని.. జీవితంలో ఎనాడూ ఎమ్మెల్యే అవుతానని అనుకోలేదన్నారు. తెలంగాణను సోనియాను ఇచ్చింది అనడం తప్పు అని.. తెలంగాణను తామే లాక్కున్నామన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…