KA Paul : మరి కొద్ది రోజులలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, ఏయే పార్టీ రాజకీయాలలో ప్రకంపనలు పుట్టిస్తుందా అని ప్రతి ఒక్కరు ఆలోచనలు చేస్తున్నారు. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సందడి చేసే వ్యక్తి మాత్రం కేఏ పాల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కేఏ పాల్ సంచలనం సృష్టిస్తున్నారు. ఆయన మాటలతో ఎప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ ఎన్నికల సందర్భంగా కేఏల్ పాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
నా జీవిత కాలంలో ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని చూడలేదు. డెమోక్రసీ బతికే ఉందా అని అనిపిస్తోంది. ఎన్నికల అధికారులు కేసీఆర్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ప్రజాశాంతి పార్టీకి సింబల్ కేటాయించకపోవడంలో అధికార పార్టీ కుట్ర ఉంది. ఇండియాలో చట్టాలు మార్చకపోతే ఈ దేశం సుడాన్, పాకిస్తాన్ లా అవుతుంది. అన్ని డాక్యుమెంట్స్ ఈసీఐకి ఇచ్చినా సింబల్ కేటాయించలేదు. మేము హెలికాప్టర్ లేదా రింగ్ సింబల్ అడిగాము. మేము అడిగిన సింబల్ ఇవ్వకపోతే మరొకటి ఏదైనా ఇవ్వాలి. రాష్ట్రంలో యాక్టివ్ గా ఉన్నా సింబల్ ఎందుకు ఇవ్వడం లేదు?రెండు రోజుల్లో సింబల్ కేటాయించకపోతే ప్రజలు ఓట్లు వేయొద్దు. ఓటు వేయాలనుకుంటే నోటాకు వేయండి. పాల్ రావాలి.. పాలన మారాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ కు 30 సీట్లు వచ్చినా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. మోడీని తిట్టిన పవన్ కల్యాణ్ మళ్ళీ మోడీతో కలిశారు. ప్యాకేజీ స్టార్స్ ను తెలంగాణ ప్రజలు నమ్మవద్దు. ప్రజాశాంతి పార్టీ ఇప్పుడు సింబల్ ఇవ్వడంతో పాటు రెండు రోజుల పాటు నామినేషన్ వేయడానికి సమయం పొడిగించాలి” అని ఈసీకి విజ్ఞప్తి చేశారు కేఏ పాల్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడిన ప్రజాశాంతి పార్టీ అధినేత కే ఏ పాల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీకి 80 సీట్లు వస్తాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి అని పేర్కొన్నారు. ఎంతో యాక్టివ్ గా పనిచేస్తున్న ప్రజాశాంతి పార్టీని యాక్టివ్ గా పనిచేయడం లేదని చెబుతూ, అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కే ఏ పాల్ మండిపడ్డారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…