Niharika Konidela : నాగబాబు ముద్దుల కూతురు నిహారిక విడాకుల వ్యవహారం గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ అవుతూనే ఉంది. జొన్నలగడ్డ చైతన్యని వివాహం చేసుకున్న నిహారిక కొద్ది రోజలకి అతని నుండి విడిపోయింది. నిహారిక విడిపోవడానికి కారణం ఆమె తండ్రి నాగబాబు చేసిన అతి గారాబమే కారణమని తెలుస్తోంది. తన కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచిన నాగబాబు ఆమె ఏది కోరినా కాదనకుండా అందించారు. వివాహమైన తర్వాత అత్తగారింట్లో ఎలా మసలుకోవాలో నేర్పలేదని మెగా కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు చెప్పుకొచ్చారు. అల్లుడు, రాజీ కోసం నాగబాబు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఒకవైపు కూతురుకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. తాను చేసిన అతి గారాబం కూతురు విడాకులు తీసుకునేందుకు కారణమైందంటూ తన సన్నిహితుల దగ్గర నాగబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారణం తానేనంటూ ఆయన లోలోన కుమిలిపోతున్నట్లు తెలుస్తోంది. 2020లో చైతన్యతో నిహారిక వివాహం జరగగా.. కొన్నాళ్ల నుంచి వీరిద్దరూ దూరంగా ఉన్నారు. నిహారిక, చైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం.. తమ పెళ్లి ఫొటోలను సైతం చైతన్య ఇన్‌స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేయడం నెటిజన్లలో అనుమానాలను రేకెత్తించాయి. నిహారికతో దిగిన ఒక్క ఫొటో కూడా చైతన్య ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో లేకపోవడంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం ఊపందుకుంది. కొద్ది రోజులకి ఆ ప్రచారాన్ని నిజం చేశారు.
ఇక విడాకుల తర్వాత నిహారిక తన కెరీర్‌పై దృష్టి పెట్టింది. ఇటీవల కొత్త సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభించింది. 11 మంది హీరోలతో సినిమా చేస్తున్నట్టు తెలియజేసింది. మరోవైపు నటిగా కూడా తను సత్తా చాటనున్నట్టు పేర్కొంది. ఇక ఇదిలా ఉంటే కొత్త దంపతులు వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి.. దీపావళి పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. వారికి ఇదే తొలి దీపావళి. తల్లిదండ్రులు నాగబాబు, పద్మజ, చెల్లెలు నిహారికతో కలిసి వారు దీపావళిని జరుపుకొన్నారు. రెడ్ కలర్ శారీలో నిహారిక స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించింది. విడాకుల తర్వాత ఆమెకి ఇది తొలి దీపావళి కాగా, ఆమె సంతోషంగా జరుపుకుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…