Kshana Kshanam : క్ష‌ణ క్ష‌ణం మూవీకి ముందుగా అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

Kshana Kshanam : విక్ట‌రీ వెంక‌టేష్‌, శ్రీ‌దేవి ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మూవీ.. క్ష‌ణ క్ష‌ణం. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ దీన్ని తెర‌కెక్కించారు. ఇందులో వినోదంతోపాటు స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక ఇందులో స‌త్య పాత్ర‌లో శ్రీ‌దేవి ఎంతో అద్భుతంగా న‌టించింది. శివ మూవీలాగే సైలెంట్ నెరేష‌న్ కాన్సెప్ట్‌తో క్ష‌ణ క్ష‌ణం మూవీని తీశారు. అప్ప‌ట్లో ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కానీ బాక్సాఫీస్ వ‌ద్ద మాత్రం అనుకున్న ఫ‌లితం రాలేదు. ఇక రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ఈ సినిమాలో మొదటిసారి వెంకీ పక్కన శ్రీ‌దేవి చేస్తున్న ఈ మూవీ పై జనంలో ఆసక్తి పెరిగింది. కెమెరామెన్ ఎస్ గోపాలరెడ్డి ఒకరోజు నిర్మాతలు డాక్టర్ కె ఎల్ నారాయణ, వై లక్ష్మ‌ణ చౌదరి లను వెంటబెట్టుకుని వర్మ దగ్గరకి వెళ్లారు.

వెంకీ, శ్రేదేవి డేట్స్ మా దగ్గర ఉన్నాయి. ఓ సినిమా చేస్తారా అని అడిగేసరికి, స్టూడెంట్ లైఫ్ నుంచి అభిమానించే శ్రీదేవితో సినిమా అనగానే వర్మ కళ్ళు మెరిశాయి. వెంటనే ఓ కథ చెప్పాడు. నిర్మాతలకు నచ్చేయడంతో శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై ప్రయత్నాలు స్టార్ట్ చేసేశారు. డైలాగ్ రైటర్ గా సత్యానంద్ ని తీసుకుని డైలాగ్స్ సింపుల్ గా ఉండాలని వర్మ చెప్పేశాడు. కోటి రూపాయలు ఉన్న‌ లగేజి బాగ్ దాచిన సందర్బంగా రైల్వే కూపన్ నెంబర్ ఆధారంగా టైటిల్ 24అనో, 361 అనో పెట్టాలని అనుకున్నారు. 24గంటలు, 48గంటలు అని కూడా అనుకున్నారు. చివరికి క్షణ క్షణం అని పెట్టారు. పరేష్ రావెల్ ని విలన్ గా తీసుకున్నారు. మరోచరిత్రలో నటించిన వరువిరల్ కృష్ణారావు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని మరీ ఇందులో వేషం ఇచ్చారు.

Kshana Kshanam movie interesting facts to know
Kshana Kshanam

కీరవాణిని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నారు. జాము రాతిరి జాబిలమ్మ ట్యూన్ కి వర్మ ఒకే చెప్పేశారు. కర్ణాటక అడవుల్లో షూటింగ్ స్టార్ట్ చేశారు. వెన్నెలకంటి జుంబారే పాట రాయగా, మిగిలినవన్నీ సీతారామ శాస్త్రి రాశారు. ఓ పాటను శ్రీదేవి చేత కూడా పాడించారు. సికింద్రాబాద్ వైశ్యా బ్యాంకులో శ్రీదేవి ఆఫీసు సన్నివేశం తీశారు. శ్రీదేవితో పాటు హేమ ఒక్కర్తే ఇందులో ఉంటుంది. నువ్వే సెకండ్ హీరోయిన్ అని హేమతో కో డైరెక్టర్ శివ నాగేశ్వరరావు చెప్పారు. అయితే ఒక్క రోజులోనే ఆమె షూటింగ్ అయిపోయింది. ఇదేమిటని అడిగితే ఇంకెవరూ ఉండరు.. అందుకే ఒక్కరోజులో అయినా నువ్వే సెకండ్ హీరోయిన్ అని శివనాగేశ్వరరావు నవ్వేశారట.

ఇక మూవీ ప్రారంభ సన్నివేశం కోసం పౌర్ణమి రాత్రుల్లో హైదరాబాద్ లో తీశారు. ఒక్క షాట్ కి మూడు నాలుగు గంటలు పట్టేదట. రైల్వే సీన్ ప్రకాశం జిల్లా, నంద్యాల ప్రాంతాల్లో షూట్ చేశారు. రైల్ ఇంజన్ పట్టాలు దాటి వచ్చేయడంతో పట్టాలు ఎక్కించడం కోసం చాలా శ్రమించారు. 50రోజుల్లో సినిమా తీసినా పూర్తికావడానికి ఏడాది పట్టింది. ఎందుకంటే శ్రీదేవి తండ్రి ఆసుపత్రి పాలవ్వడం, చనిపోవడంతో కొన్ని రోజులు షూటింగ్ చేయలేదు. కోటిన్నర ఖర్చయింది. 1991అక్టోబర్ 9న 4ట్రాక్ సౌండ్ సిస్టం లో క్షణ క్షణం రిలీజ్. మొదట్లో యావరేజ్ అనుకున్న సినిమా సెకండ్ రన్ లో సూపర్ హిట్ అయింది. అందం, అమాయక‌త్వం, భయం మేళవించి శ్రీదేవి చేసిన నటన అదిరిపోయింది. బ్రహ్మానందం కొంచెం సేపు కనిపించినా హాస్యంతో అదరగొట్టేశాడు. విలన్ పాత్రకు పరేష్ రావెల్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. తమిళం, హిందీలో కూడా ఈ మూవీ అనువాదం అయింది.

Share
editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago