Waltair Veerayya : వాల్తేరు వీర‌య్య ఫ‌స్ట్ రివ్యూ.. సంక్రాంతికి బాక్సాఫీస్‌ని షేక్ చేయ‌డం ఖాయ‌మా..?

Waltair Veerayya : టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవిఇటీవ‌ల గాడ్ ఫాద‌ర్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన విష‌యం తెల‌సిఇందే. త్వరలోనే వాల్తేరు వీరయ్యగా సందడి చేసేందుకు రెడీ అంటున్నాడు. వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో సందడి చేయనుండ‌గా, విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ అభిమానులను హుషారెత్తిస్తున్నారు మేకర్స్. ఇటీవ‌ల చిరంజీవి స్టైలిష్‌ లుక్ ఒకటి నెట్టింట్లో షేర్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్ టీం. చుట్టూ గన్స్.. మధ్యలో స్టైలిష్‌ గాగుల్స్‌ తో స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తూ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తున్నాడు వాల్తేరు వీరయ్య.

సంక్రాంతికి చిరంజీవి సినిమాతో పాటు బాల‌కృష్ణ‌, విజ‌య్ సినిమాలు విడుద‌ల కానున్నాయి. ఈ సినిమాలు ఎలా ఉంటాయ‌ని అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొన్న నేప‌థ్యంలో వాల్తేరు వీరయ్య మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటి అని చెప్పుకొనే ఉమర్ సంధు వాల్తేరు వీరయ్య చిత్రంపై షార్ట్ రివ్యూ ఇచ్చాడు ‘చిరంజీవిగారు దయచేసి ఇలాంటి రొమాంటిక్ రోల్స్ చేయడం మానేసి, సీరియస్ రోల్స్ చేస్తే బెటర్. మిమ్మల్ని ఆ తరహా పాత్రల్లో చూసి బోర్ కొట్టేసింది. వాల్తేరు వీరయ్య చిరంజీవికి మరో డిజాస్టర్ కానుంది, అని ట్వీట్ చేశారు.

Waltair Veerayya first review know how is it
Waltair Veerayya

రొటీన్ కమర్షియల్, రొమాంటిక్ రోల్స్ కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేస్తే మంచిది. వాల్తేరు వీరయ్య మూవీలో ఎలాంటి కొత్తదనం లేదు. ఆకట్టుకోలేదని పరోక్షంగా ఉమర్ సంధు తన ట్వీట్ చేయ‌డంతో మెగా అభిమానుల‌కి భ‌యం ప‌ట్టుకుంది. అయితే ఇటీవ‌లి కాలంలో ఉమైర్ సంధు రివ్యూని ఎవ‌రు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఆయ‌న బాగుంది అంటే ఆ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. బాలేదు అంటే హిట్ అవుతున్నాయి. కాబ‌ట్టి పెద్ద‌గా ఆయ‌న రివ్యూకి ప్ర‌యారిటీ ఇవ్వ‌డం లేదు. ఇక‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ వాల్తేరు వీరయ్యలో రవితేజ ఏసీపీ విక్రమ్‌సాగర్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ట్రెండింగ్‌ అవుతోంది. బాబీ (కేఎస్ ర‌వీంద్ర‌) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago