Krishnam Raju : తెలుగు తెరపై చెరగని ముద్ర వేసుకున్న నటుడు కృష్ణం రాజు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా కృష్ణం రాజు నటించి మెప్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణం రాజు చికిత్స పొందుతూ కన్నుమూశారు. 83 ఏళ్ల కృష్ణంరాజు మరణవార్త విని టాలీవుడ్ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైంది. నటనతోనే కాదు, డైలాగ్ డెలివరీతో కూడా కృష్ణం రాజు ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. మొదట్లో నెగెటివ్ పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైన కృష్ణంరాజు ఆ తరువాత హీరోగా మెరిశారు.
ఆదివారం తెల్లవారుజామున కృష్ణం రాజు కన్నుమూయగా, ఆయన మృతికి సంబంధించి వైద్యులు పలు విషయాలు వెల్లడించారు. రక్తప్రసరణ సరిగా లేకపోవడంతో గతేడాది కృష్ణంరాజు కాలుకు సర్జరీ జరిగిందని చెప్పారు. దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన బాధపడుతున్నట్టుగా తెలిపారు. ఆగస్టు 5వ తేదీన పోస్టు కోవిడ్ సమస్యలతో కృష్ణంరాజు ఏఐజీ ఆస్పత్రిలో చేరినట్టుగా వెల్లడించారు. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కారణంగా ఊపిరితిత్తుల్లో తీవ్ర న్యుమోనియా ఉన్నట్లు గుర్తించామని వైద్యులు పేర్కొన్నారు.
కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి కృష్ణంరాజుకు వెంటిలేటర్‌పై చికిత్స అందించినట్టుగా వైద్యులు స్పష్టం చేశారు. ఆదివారం తెల్లవారుజామున హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆయన కన్నుమూసినట్టు తెలియజేశారు. కాగా కృష్ణం రాజు.. కృష్ణవేణి, భక్త కన్నప్ప, త్రిశూలం, బొబ్బిలి బ్రహ్మన్న, పల్నాటి పౌరుషం వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగారు. కృష్ణం రాజు మరణవార్తతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. సోమవారం ఉదయం కృష్ణం రాజు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలుస్తుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…