High BP : ఈ ఆహారాల‌ను మీరు రోజూ తింటున్నార‌ని తెలుసా..? ఇవి బీపీని అమాంతం పెంచేస్తాయి జాగ్ర‌త్త‌..!

High BP : హైబీపీ ఉండ‌డం ఎంత ప్ర‌మాద‌మో అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌స్తాయి. హార్ట్ ఎటాక్‌లు సంభ‌విస్తాయి. ఒక్కోసారి ఇవి ప్రాణాల మీద‌కు తెస్తాయి. క‌నుక ఎవ‌రైనా హైబీపీ ఉంటే త‌గు జాత్ర‌లు తీసుకోవాల్సిందే. ఇక హైబీపీ లేని వారు అది రాకుండా ఉండేందుకు కూడా జాగ్ర‌త్తలు పాటించాలి. ముఖ్యంగా వారు కింద సూచించిన ప‌లు ఆహారాల‌ను తీసుకోవ‌డం త‌గ్గించాలి, లేదా వాటిని పూర్తిగా మానేయాలి. దీంతో హైబీపీ రాకుండా చూసుకోవ‌చ్చు. ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. మ‌రి హైబీపీ రాకుండా ఉండాలంటే మనం ఏయే ఆహారాల‌ను పూర్తిగా మానేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

ప్యాక్ చేయ‌బ‌డిన చిక్కుళ్లు, టిన్నుల్లో అమ్మే ట్యూనా ఫిష్‌, నిల్వ ఉండే ఉప్పు త‌దిత‌ర ఆహారాల‌ను తిన‌రాదు. ఇవి ర‌క్తంలో సోడియం ప‌రిమాణాన్ని పెంచుతాయి. ఫ‌లితంగా హైబీపీ వ‌స్తుంది. క‌నుక ఈ ఆహారాల‌ను మానేయాలి. కొవ్వు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకుంటే శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. దీంతో ర‌క్త నాళాలు గ‌ట్టిగా మారుతాయి. ఫ‌లితంగా హైబీపీ వ‌స్తుంది. క‌నుక కొవ్వు ప‌దార్థాల‌ను కాకుండా పండ్లు, ఆకుకూర‌లు, కూర‌గాయ‌ల‌ను తీసుకోవాలి. ఇవి గుండె ఆరోగ్యాన్ని ర‌క్షిస్తాయి.

if you are taking these foods then stop High BP will increase
High BP

ఎప్పుడో ఒక‌సారి మ‌ద్యం సేవిస్తే ఫ‌ర్వాలేదు. కానీ రోజూ మ‌ద్యం సేవించే అల‌వాటు ఉన్న‌వారిలో బీపీ పెరుగుతుంది. గుండె జ‌బ్బులు వ‌స్తాయి. క‌నుక ఆ అల‌వాటును మానుకుంటే మంచిది. లేదంటే స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకున్న వార‌వుతారు. నీరు ప్ర‌వ‌హించే ఏదైనా చిన్న‌పాటి పైపును అలాగే కొంత సేపు వ‌త్తి పెట్టి ఉంచండి. వెంట‌నే వ‌దిలేయండి. అప్పుడు ఏమ‌వుతుందో తెలుసు క‌దా. స‌రిగ్గా కాఫీ తాగిన‌ప్పుడు కూడా మ‌న ర‌క్త‌నాళాల‌కు అదే జ‌రుగుతుంది. క‌నుక కాఫీ బాగా తాగే వారు త‌క్కువ‌గా తాగ‌డం లేదా దాన్ని పూర్తిగా మానేయ‌డం మంచిది. దీంతో హైబీపీ, గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

కొవ్వు తీసిన పాల‌ను తాగ‌డం ఓకే. కానీ కొవ్వు తీయ‌ని పాల‌ను తాగితే వాటిలో ఉండే కొవ్వు మ‌న శ‌రీరంలో చేరి ర‌క్త‌నాళాల్లో పేరుకుపోతుంది. నాళాలు దృఢంగా మారుతాయి. ర‌క్త స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డుతుంది. ఫ‌లితంగా బీపీ పెరుగుతుంది. గుండె జ‌బ్బులు వస్తాయి. క‌నుక ఎవరైనా కొవ్వు తీసిన పాల‌ను తాగితే మంచిది. పాల‌తో త‌యారు చేసే చీజ్‌లో కొన్ని కంపెనీలు రుచి కోసం ఉప్పు క‌లుపుతాయి. ఇలాంటి చీజ్‌ను తింటే శ‌రీరంలో సోడియం పెరిగిపోయి హైబీపీ వ‌స్తుంది. మోజ‌రెల్లా, ఎమ్మెన్టాల్‌, ఛెడ్డార్‌, ఫెటా, ఎడామ్ త‌దిత‌ర చీజ్ ర‌కాల్లో ఉప్పును బాగా క‌లుపుతారు. క‌నుక ఈ చీజ్ వెరైటీల‌కు దూరంగా ఉండ‌డం మంచిది.

చ‌క్కెర ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తిన‌రాదు. ఇవి స్థూల‌కాయం, డ‌యాబెటిస్‌ల‌ను క‌ల‌గ‌జేస్తాయి. దీర్ఘ‌కాలంలో హైబీపీ వ‌స్తుంది. అనంత‌రం గుండె జ‌బ్బులు వ‌స్తాయి. ర‌క్త‌నాళాలు గ‌ట్టిప‌డి హార్ట్ స్ట్రోక్స్ వ‌స్తాయి. క‌నుక ఎవ‌రైనా చ‌క్కెర ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తిన‌రాదు. ప్రాసెస్ చేయ‌బ‌డిన మాంసాన్ని అస్స‌లు తిన‌రాదు. ఎందుకంటే దాన్ని నిల్వ ఉంచేందుకు ఉప్పును వాడుతారు. దీనికి తోడు నిల్వ ఉంచబ‌డిన మాంసంలో చెడు కొవ్వు మరింత పెరుగుతుంది. అలాంట‌ప్పుడు ఆ ఆహారాన్ని తీసుకుంటే రక్త‌నాళాల్లో కొవ్వు పేరుకుపోయి హైబీపీ, హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక ఇలాంటి ఆహారాల‌ను తీసుకోవ‌డం మానేస్తే మంచిది.

నిల్వ ఉంచే ఊర‌గాయ ప‌చ్చ‌ళ్ల‌లో ఉప్పు ఎక్కువ‌గా వేస్తార‌న్న విష‌యం తెలిసిందే. అయితే అలాంటి ప‌చ్చ‌ళ్లను బాగా తింటే శ‌రీరంలో సోడియం నిల్వ‌లు పెరిగి హైబీపీ వ‌స్తుంది. కాబ‌ట్టి ప‌చ్చ‌ళ్ల‌ను మితంగా తీసుకోవ‌డం మంచిది. ఇలా ప‌లు ఆహారాల‌ను పూర్తిగా మానేయ‌డం లేదా త‌క్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల హైబీపీ రాకుండా ముందుగానే జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. దీంతో గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

Share
editor

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago