Kota Srinivasa Rao : ఇటీవల సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. బ్రతికి ఉన్న వాళ్లని చంపేస్తూ అభిమానుల్లో గందరగోళం రేపుతున్నారు. పెరుగుతున్న టెక్నాలజీకి తోడు ఫేక్ న్యూస్‌ల హంగామా రెట్టింపవుతూ ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఎన్నో రకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో సీనియర్ నటుడైన కోట శ్రీనివాసరావు చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తల ప్రవాహం షురూ అయింది. ఈ క్రమంలో కోట ఓ వీడియో ద్వారా అసలు క్లారిటీ ఇచ్చారు. నేను బతికే ఉన్నాను.. చనిపోలేదంటూ స్వయంగా ప్రకటించుకున్నారు ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు. ఆయన చనిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు రావటంతో.. ఉదయం నుంచి ఫోన్లు వస్తున్నాయని.. 50, 60 కాల్స్ ను నేనే అటెండ్ చేశానంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మార్చి 21వ తేదీ మంగళవారం వీడియో రిలీజ్ చేసిన ఆయన .. సోషల్ సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని అభిమానులను కోరారు. మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దని.. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని.. ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలని కోరారు కోట శ్రీనివాసరావు. ఓ వైపు సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు నెలకొంటున్న తరుణంలో కోట శ్రీనివాసరావు మరణించారంటూ థంబ్ నెయిల్ కనిపించడంతో అంతా షాకయ్యారు. ఈ విషయం కోట వరకు వెళ్లడంతో ఆయన తన బాధను వ్యక్తం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
మా మీద దయుంచి మీరే కాస్త ఇలాంటివి అరికట్టండి.. ఇది విని కాస్త పెద్దవాళ్లుంటే గుండె ఆగి చచ్చిపోతారని పోలీసులకు చెప్పాను. ఇలాంటి వదంతులు మీరు నమ్మొద్దని మనవి చేస్తున్నా. మిగతావాళ్లకు తెలియ జేయండి. ఇది చూసైనా వాళ్లకు బుద్ధి వస్తుంది. జీవితంలో డబ్బు సంపాదించడానికి చండాలపు పనులు బోలెడు ఉన్నాయి. ఇది అక్కర్లేదు. మనిషి ప్రాణాలతో ఆడుకోకూడదు. అంతే. నమస్కారం అని కోట శ్రీనివాసరావు అన్నారు.తెలుగు తెరపై కోట శ్రీనివాసరావుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి అలరించిన ఆయన పలు అవార్డ్స్ అందుకున్నారు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కోట చేసిన ఎన్నో పాత్రలు ప్రేక్షకుల మెప్పు పొందారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…