Niharika Konidela : టాలీవుడ్లో మెగా ఫ్యామిలీని ఏదో శాపం వెంటాడుతున్నట్టు అర్ధమవుతుంది.. ఆ కుటుంబంలో వివాహాలు ఎన్నో రోజులు నిలవడం లేదు. చిరు సోదరుడు పవన్ కళ్యాణ్ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు.ఇక చిరు పెద్ద కుమార్తె సుస్మిత కూడా గతంలో వైవాహిక జీవితంలో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక చిరు రెండో కుమార్తె శ్రీజ విషయానికి వస్తే ముందుగా శిరీష్‌ను ప్రేమ వివాహం చేసుకుంది ఈ పెళ్లి ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు.. ఆ తర్వాత అతని నుండి విడిపోయి కళ్యాణ్ దేవ్‌ని రెండో భర్తగా స్వీకరించింది. ఈ దంపతులకు కూడా ఒక పాప పుట్టాక మళ్ళీ మనస్పర్ధలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు.
ఇక ఇప్పుడు ఇది నాగబాబు కుటుంబానికి కూడా పాకేసింది. నాగబాబు కుమార్తె నిహారిక, అల్లుడు జొన్నలగడ్డ చైతన్య మధ్య ఏదో ? జరుగుతుందన్న గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం వీరిద్దరూ ఒకరి సోషల్ మీడియా అకౌంట్లు మరొకరు ఫాలో కావటం లేదట. చైతన్య తన అకౌంట్ నుంచి పెళ్లి ఫోటోలు డిలీట్ చేశారని, ఆమెతో కలిసి విందులు, వినోదాలు, విహారాలు వంటి స్వీట్ మెమోరీస్ సైతం తొలగించాడని టాక్ నడుస్తుంది. ఈ పరిణామాలు నిహారిక విడాకుల వార్తలకు కారణమయ్యాయి.
నిహారిక భర్తను అన్ ఫాలో కావడంతో ఈ అనుమానాలు బలపడ్డాయి. తాజా సమాచారం ప్రకారం నిహారిక-వెంకట చైతన్య మధ్య మనస్పర్థలు నిజమేనని, చిరంజీవి సర్ది చెప్పేందుకు రంగంలోకి దిగారని వార్తలు వినిపిస్తున్నాయి.. నాగబాబుకు ఆవేశం ఎక్కువ కాబట్టి చిరంజీవి చాలా సౌమ్యంగా మాట్లాడి ఈ వివాదం సద్దుమణిగేలా చూస్తున్నాడని టాక్ నడుస్తుంది. వెంకట చైతన్య, అతని ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడి వివాదానికి చిరు తెర దింపాలనుకుంటున్నారట. ఇదిలా ఉంటే వీరిద్దరి నిశ్చితార్థం 2020 ఆగస్టు 13న జరిగింది. కరోనా కారణంగా పెళ్లి కొంత ఆలస్యం అయ్యింది. అదే ఏడాది డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ వీరి వివాహానికి వేదికగా మారింది. ఏదేమైన ఈ ఇద్దరి మధ్య విభేదాలు నడుస్తున్నాయని వస్తున్న వార్తలు అబద్ధం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…