Kodali Nani : కొడాలి నాని.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీ రాజకీయాలలో ఆయన పేరు ఎప్పుడు హైలైట్‌గా నిలుస్తుంటుంది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ వైసీపీ మధ్య ఆసక్తికర పోరు జరుగుతుండగా, సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు ఇరు పార్టీల నాయకులు. దమ్ముంటే.. నాతో చర్చకు సిద్ధమా? అంటూ సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. చంద్రబాబు చేసిన సవాల్ పై వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. తాజాగా దీనిపై ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు టార్గెట్ గా మరోసారి చెలరేగిపోయారు. రాష్ట్ర అభివృద్ధిపై సీఎం జగన్ బహిరంగ చర్చకు రావాలంటూ చంద్రబాబు చేసిన ఛాలెంజ్ కు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు.
అసెంబ్లీలో చర్చకు అవకాశం ఉన్నా.. పారిపోయిన చంద్రబాబు చేతకాక X లో చాలెంజ్ లా? అంటూ విమర్శించారు. ”సీఎం జగన్ చాలా స్పష్టంగా ఎన్నికలకు వెళుతున్నారు. మీ కుటుంబాల్లో మంచి జరిగితే తనకు ఓటు వేసి మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు.. అమలు చేసిన ఓ పథకం, లేదా రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయో చెప్పాలని జగన్ ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే కొడాలి నాని తాజాగా చందం్రబాబు, పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. వాలంటీర్లపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏడుస్తున్నారు అంటూ కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఎక్స్‌లో ఛాలెంజ్‌లు చేస్తున్నారని ఆయన విమర్శించారు. దేశ చరిత్రలో ఇద్దరు పెద్ద నాయకుల మధ్య చర్చ జరిగిందని ఆయన ప్రశ్నించారు. 14 ఏళ్ల పాటు చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. తన పాలనలో మంచి జరిగితే మరో అవకాశం ఇవ్వాలని జగన్ విజ్ఞప్తి చేస్తున్నారని కొడాలి నాని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న జగన్ తో కాదు. నేను సిద్ధం అంటే నాతో చర్చకు చంద్రబాబు వస్తారా? మూడు పార్టీలతో కలిసి వస్తున్నా.. సీఎం జగన్ ఎదుర్కోలేని స్థాయి చంద్రబాబుది. చంద్రబాబు పార్టీ సైజు ఎంతో తెలుసుకోవాలి. ఆ పార్టీకి పార్లమెంట్, రాజ్యసభ, అసెంబ్లీ, శాసనమండలిలో ఎంతమంది ఉన్నారో గుర్తించి ఛాలెంజ్ లు చెయ్యాలి” అని కౌంటర్ ఇచ్చారు కొడాలి నాని.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…