Kodali Nani : ప్రస్తుతం ఏపీలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. వైసీపీ విషయానికి వస్తే కొడాలి నాని, పేర్ని నాని, రోజా వంటి వారు టీడీపీ, జనసేన నాయకులపై తీవ్ర విమర్శలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొడాలి నాని తాజాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. టీడీపీ అధినేత చంద్రబాబు పాపాలు పండాయని, ఇప్పుడు అవి బయటపడ్డాయని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. కేసును క్లోజ్ చేసుకోవాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారన్నారు. కానీ టెక్నికల్ అంశాలతో ఆయనకు రిలీఫ్ దొరకదన్నారు. కక్ష సాధింపు అనడానికి తాము అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలో ఆయనను జైల్లో పెట్టలేదన్నారు. చంద్రబాబు దోపిడీకి సంబంధించి అన్ని డాక్యుమెంట్లను పరిశీలించినట్లు చెప్పారు. ఆయన ప్రమేయం తేలాకే అరెస్ట్ జరిగిందన్నారు.
17ఏ ప్రకారం తనను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలని చంద్రబాబు చెబుతున్నారని, ఆయన న్యాయవాదులూ అదే చెబుతున్నారని, కానీ తప్పు చేయలేదని చెప్పడం లేదన్నారు. తన జీవితంలో పద్దెనిమిది కేసుల్లో స్టేలు తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు రెండెకరాలతో రాజకీయ జీవితం ప్రారంభించి, ఇన్నివేల కోట్లకు ఎలా ఎదిగారో చెప్పాలన్నారు. హెరిటేజ్‌లో రెండు శాతం షేర్లు అమ్మితే రూ.400 కోట్లు వస్తాయని నారా భువనేశ్వరి చెప్పారని, అంటే ఈ ఆస్తుల విలువ రూ.20వేల కోట్లు అని ఆమె స్వయంగా చెప్పారన్నారు. హెరిటేజ్‌లో రూ.20వేల కోట్ల వైట్ మనీ ఉంటే, రూ.70వేల కోట్లు బ్లాక్ మనీ ఉంటుందన్నారు.వినేవాడు ఎవరైనా ఉంటే చంద్రబాబు హరికథను ఇంగ్లీష్ లో కూడా చెబుతారని ఎద్దేవా చేశారు. ఏపీలో అత్యంత అవినీతిపరుడు చంద్రబాబే అన్నారు. రెండెకరాల పొలం నుంచి రూ.2 లక్షల కోట్లకు ఎలా పడగలెత్తారో చెప్పాలని కొడాలి నాని అన్నారు.
పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అవ్వాలంటే చంద్రబాబు సపోర్ట్ కావాలని అన్నారు. అదే సమయంలో చంద్రబాబు 18 సీట్లతో ప్రతిపక్ష హోదా దక్కించుకోవాలంటే పవన్ కల్యాణ్ సపోర్ట్ కావాలన్నారు. పవన్ కల్యాణ్ కు అసెంబ్లీకొచ్చి మైకు పట్టుకోవాలని, అధ్యక్షా అని అనాలని కోరిక ఉంది. కానీ, ఒంటరిగా వస్తే మైకు కదా అసెంబ్లీ గేటు కూడా పట్టుకోలేడు పవన్ కల్యాణ్. ఈ విషయం పవన్ కల్యాణ్ కు కూడా తెలుసు. అందుకే చంద్రబాబు సపోర్ట్ తీసుకుంటున్నారు అని చెప్పారు కొడాలి నాని.జనసేన కార్యకర్తలు తన్నులు తిన్నా పర్వాలేదు. జనసేన పార్టీ సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు. ఎవరు ఏమైనా పర్లేదు. తాను ఎమ్మెల్యే కావాలి అన్నది పవన్ కోరిక. పవన్ ఎమ్మెల్యే అవటం కోసం, చంద్రబాబు ప్రతిపక్ష హోదా కోసం ఆరాటపడుతున్నారని కొడాలి నాని కామెంట్స్ చేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…