Anchor Suma : రేయ్ అమ్మాయి చేయి వ‌ద‌లరా.. అంద‌రి ముందు కొడుకు ప‌రువు తీసిన సుమ‌..

Anchor Suma : యాంకర్ సుమ మైక్ పట్టుకుంటే ఆమె గొంతు నుంచి మాటలు గలాగలా ఎలా వచ్చేస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మూడు దశాబ్దాలుగా ఆమె తెలుగు బుల్లితెరను ఏలుతున్న సుమ ఇప్పుడు త‌న కొడుకు రోష‌న్ క‌న‌కాల‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తుంది. రవికాంత్ పేరెపు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాలకు రవికాంత్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మానస చౌదరి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్ కి నాని ముఖ్య అతిథిగా హాజ‌రై చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

రాజీవ్ కనకాల, యాంకర్ సుమల కుమారుడు రోషన్.. ఇప్పటికే ‘నిర్మల కాన్వెంట్’ అనే చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించి తనలోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించి, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు ఆ మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన రోషన్ కూడా హీరోగా పరిచయం అవుతున్నాడు. ‘బబుల్ గమ్’ ఫస్ట్ లుక్‌ను రాజమౌళి విడుదల చేస్తూ.. నటుడిగా డెబ్యు చేస్తున్నందుకు కంగ్రాచులేషన్స్ రోషన్. నీ మర్క్‌ను క్రియేట్ చేసుకుంటావని, రాజీవ్‌ను, సుమగారిని గర్వపడేలా చేస్తావని కోరుకుంటున్నాను. బబుల్ గమ్ టీమ్ మొత్తానికి నా బెస్ట్ విషెస్’ అంటూ రాజమౌళి.. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. నాని టీజ‌ర్ విడుద‌ల చేసారు. ఇక త‌ర్వాత సుమ ఎవ‌రెవ‌ర‌ని దింపుతుందో.

Anchor Suma funny incident with her son
Anchor Suma

అయితే టీజ‌ర్ లాంచ్ ఈవెంట్‌లో ఆస‌క్తిర సంఘ‌ట‌నలు చోటు చేసుకున్నాయి. చిత్ర బృందంని సుమ పిలుస్తున్న స‌మ‌యంలో చివ‌రిగా రోష‌న్‌, మాన‌సని కూడా ఇన్వైట్ చేసింది. ఆ స‌మ‌యంలో రోష‌న్‌.. హీరోయిన్ చేయి వ‌ద‌ల్లేదు. నువ్వు ప‌ట్టుకోక‌పోయిన ఆ అమ్మాయి వ‌స్తుంది. అస‌లు చేయి వ‌దిలేలా లేడు. న‌న్ను చూడు.. నాన్న లేకుండా ఎలా వ‌చ్చానో అంటూ త‌న‌దైన పంచ్‌లు వేసింది సుమ‌. ఇక టీజర్ లో సుమ కొడుకు రోషన్ కూసింత హద్దులు మీరిపోయాడు ..హగ్గులు , ముద్దులు, కొరకడాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇదే విషయంపై స్టేజ్ పైకి వచ్చిన రోషన్ తండ్రి రాజీవ్ కనకాల మాట్లాడుతూ …టీజర్ చూస్తుంటే రోషన్ బాగా చేసినట్లే అనిపిస్తుంది .. చివరకి షూట్ చూసి అంటూ దీర్ఘం తీస్తూ స్పీచ్ ను ఆపేశారు .. దీనితో పక్కనే ఉన్న సుమ వచ్చి రాజా మనం కొన్ని మాట్లాడకుండా.. ఉంటేనే బెటర్ అంటూ నవ్వుతూ కామెంట్ చేసింది . నోరు మూయించేసింది.. దీంతో అక్కడున్న జనాలు సైతం నవ్వుకున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago