Roja : ఏపీలో రాజకీయం వాడివేడిగా సాగుతున్న క్రమంలో ఒకరిపై ఒకరు దారుణంగా విమర్శలు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ విమర్శలు పర్సనల్‌గా కూడా ఉంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ మంత్రి రోజా గత కొద్ది రోజులుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై తీవ్రమైన విమర్శలు చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా నగరి పబ్లిక్ మీటింగ్‌లో రోజా మాట్లాడుతూ.. జగన్ చేసిన అభివృద్దిని గురించి తెలియజేసింది. అంతేకాదు విశాఖ నుండి పరిపాలన అందించనున్నట్టు పేర్కొంది. ప్రజలకి ఎన్నో సేవలు చేశారని, అయితే కొందరు మాత్రం ఆయనపై పడి ఏడుస్తున్నారంటూ ఇన్‌డైరెక్ట్‌గా చంద్రబాబు, పవన్‌పై విమర్శలు చేసింది. ఇది జగనన్న అడ్డా అని ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది.
సీఎం జగన్ ను పట్టుకుని నీ బతుకెంత అని పవన్ అడుగుతాడా అంటూ రోజా ఫైర్ అయ్యారు. 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, 151 మంది మద్దతుతో జగన్ సీఎం అయ్యారని గుర్తు చేసారు. 22 మంది ఎంపీలను తన జెండా, అజెండాతో గెలిపించారని రోజా చెప్పుకొచ్చారు. నీ సొంత అన్ననే గెలిపించుకోలేకపోయిన పవన్ ను ప్రజలు నీవెంత నీబతుకెంత అని అడుగుతున్నారని రోజా పేర్కొన్నారు. ప్రజలకు ఇఛ్చిన మాట కోసం దేశాన్నే గడగడలాడించిన సోనియా నే ఎదుర్కొన్న నేత జగన్ అని రోజా వివరించారు. తల్లిని తిట్టిన వాడితో ప్యాకేజీ మాట్లాడుకున్న వ్యక్తి పవన్ అని రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్ర చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 82 శాతం సీట్లతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి జగన్ అని రోజా ఇటీవల పవన్‌పై తీవ్ర విమర్శలు చేసిన విషయం విదితమే.
జనసేన 136 స్థానాల్లో నిలబడితే 120 చోట్ల డిపాజిట్లు గల్లంతు అయ్యాయని గుర్తు చేసారు. జగన్ పార్టీ పెట్టి ఎంపీగా పోటీ చస్తే 5.43 లక్షల ఓట్ల మెజార్టీతో రికార్డు సాధించారని గుర్తు చేసారు. జగన్ ఫొటోతో పోటీ చేసిన గ్రంధి శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి చేతిలో ఓడిన పవన్ గురించి అందరూ ప్రశ్నిస్తున్నారని రోజా పేర్కొన్నారు. 12 ఏళ్లు పార్టీగా నడిపిస్తున్న దమ్మున్న నేత జగన్ గా రోజా వివరించారు. ఎంత చిన్న పార్టీ అయినా ఒక ఐడెంటిటీ ఉంటుందని, చంద్రబాబుకు పనిచేయడమే తన ఐడెంటిటీగా పవన్ భావిస్తున్నారని రోజా అన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…