Kodali Nani : గత ఎన్నికలలో 175 సీట్లు గెలుచుకున్న వైసీపీ ఈ సారి కూడా అదే జోరు కొనసాగించాలని అనుకుంటుంది. కొద్దిరోజులుగా నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేస్తున్న అధిష్టానం గుడివాడ సీటుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మాజీ మంత్రి కొడాలి నానికి మరోసారి పోటీ చేయడం ఖాయమని వైఎస్సార్‌సీపీ కేడర్ ధీమాతో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు గుడివాడలో ఓ ఆసక్తికర పరిణామం జరిగింది. పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో తెరపైకి కొత్త పేరు వచ్చింది. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి వైసీపీ లో ఎదురు లేదు. సీఎం జగన్ వద్ద మంచి పలుకుబడి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆయనకు టిక్కెట్ ఖరారుచేయలేదు. అలాగని వేరే అభ్యర్థి పేరు బయటకు రాలేదు.
కానీ ఇప్పుడు కొత్తగా వేరే అభ్యర్థి పేరు వినపిస్తోంది. మండలి హనుమంతరావు అనే నేతకు గుడివాడ టిక్కెట్ ఇవ్వబోతన్నారన్న ప్రచారం జరుగుతోంది. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ప్రధాన కూడళ్లలో బ్యానర్లు వెలిశాయి. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చిందంటు ఫోన్లలో వైసీపీ నేతల గుసగుసలాడుకుంటున్నారు. హనుమంతరావుకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడుగా హనుమంతరావుకు గుర్తింపు ఉంది. పట్టణంలో ఏర్పాటైన బ్యానర్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
గుడివాడ వైసీపీలో గందరగోళం నెలకొనడంతో అధికార పార్టీ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు సంచలనంగా మారడంతో మండలి హనుమంతరావు పేరుతో ఉన్న ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. గుడివాడ ప్రధాన కూడలిలో ఫ్లెక్సీలు వెలిసిన గంటలోపే వాటిని తొలగించారు. కొడాలి నాని ఆదేశాలతోనే ఫ్లెక్సీలు తొలగించారని మండల హనుమంతరావు వర్గీయులు ఆరోపిస్తున్నారు.. ఇప్పుడు సీఎం జగన్ నిజంగా అభ్యర్థిని మార్చే పరిస్థితి లేదని వైసీపీ వర్గాలనుకుంటున్నాయి. అయితే గుడివాడలో సర్వే రిపోర్టులు చూసి .. కాపు సామాజికవర్గ అభ్యర్థికి టిక్కెట్ ఇస్తే బాగుంటుందన్న ఆలోచన జగన్ చేయవచ్చని చెబుతున్నారు. మరో కీలక నియోజకవర్గానికి కొడాలి నానిని పంవవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తంగా మండలి హనుంతరావు గుడివాడ వైసీపీలో కలకలం రేపుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…