Kirak RP Hotel : బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్‌ని ఫాలో అయ్యే వారికి కిరాక్ ఆర్పీ గురించి ప్రత్యేక పరిచయాలు చేయనక్కర్లేదు. తన కామెడీతో ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించిన కిరాక్ ఆర్పీ ఆర్థికంగా కూడా నిలదొక్కుకున్నాడు. అతను కేవలం కమెడియన్ గానే కాకుండా ఇండస్ట్రీలో దర్శకుడిగా కూడా కొన్ని ప్రయత్నాలు చేశాడు. అయితే ఆ రూట్లో మాత్రం అతనికి సరైన సక్సెస్ రాలేదు. అయితే కిరాక్ ఆర్పీ మొదట్లో జబర్దస్త్ షోకి ఒక చిన్న రైటర్ గా వర్క్ చేసి ఆ తర్వాత రెగ్యులర్ కమెడియన్ గా మారిపోయి అనంతరం మళ్ళీ గ్రూప్ లీడర్ గా కూడా తన రేంజ్ పెంచుకున్నాడు. ఆర్ధికంగా కూడా బాగా సెటిల్ అయ్యాడు.
ఇటీవల సొంతంగా ఫ్లాట్ కూడా తీసుకొని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతని భార్య కూడా ఈవెంట్స్ నిర్వహిస్తూ మంచి వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. అయితే ఆ మధ్య జబర్ధస్త్ షోపై దారుణమైన విమర్శలు చేసి హాట్ టాపిక్‌గా నిలిచాడు కిరాక్ ఆర్పీ. అయితే హైపర్ ఆది, రాంప్రసాద్,షేకింగ్ శేషు వంటి వారు ఆర్పీకి కౌంటర్ ఇస్తూ వచ్చారు. ఒకప్పటి జబర్దస్త్ మేనేజర్ ఏడుకొండలు కూడా తెరమీదకు రావడమే కాక ఆర్పీ చేసిన కామెంట్స్ ని ఖండించారు. శ్యాం ప్రసాద్ రెడ్డి లాంటి వ్యక్తిత్వాన్ని ఎక్కడా చూడలేమని ఆయన చాలా మంచివారిని, ఆయన మీద కామెంట్ చేసే స్థాయి ఆర్పీది కాదని చెప్పుకొచ్చారు.
అయితే ఆర్పీ ప్రస్తుతం వ్యాపారంపై దృష్టి పెట్టాడు. సొంతంగా ఒక కిచెన్ పెట్టుకుని బిజినెస్ కొనసాగిస్తున్నాడు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే కిచెన్ హైదరాబాదులో స్థాపించగా, అందులో చేపల పులుసు వంటకాలతో ప్రత్యేకంగా అతను ఈ బిజినెస్ కొనసాగిస్తున్నాడు. వాటిని ఒక కిచెన్ లో రెడీ చేసి హైదరాబాదులోనే ఒక కర్రీస్ పాయింట్ లో వాటిని అమ్ముతూ మంచి బిజినెస్ చేస్తున్నాడు . స్నేహితుడు కలిసి 50 లక్షలు పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టామని చేపల పులుసు అంటే అందరికీ నెల్లూరు గుర్తుకు వస్తుంది అని అదే టేస్ట్ ఇక్కడ అందరికీ దొరికే విధంగా ప్రయత్నం చేస్తున్నాము అని కిరాక్ ఆర్పీ అన్నాడు. హైదరాబాదులో 15 కు పైగా బ్రాంచ్ లు కూడా పెట్టాలని ఆలోచనతో ముందుకు సాగుతున్నట్టు చెప్పిన ఆర్పీ తనకు నెలకు లక్షల్లో టర్నోవర్ కూడా ఉందని చెప్పడం విశేషం.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…