Nagarjuna Bigg Boss : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్రమం తెలుగులో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. సీజన్ల మీద సీజన్స్ జరుపుకుంటున్న ఈ షోకి ముందు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత నాని హోస్ట్‌గా ఉన్నాడు. అనంతరం నాగ్ హోస్ట్ బాధ్యతలు చేపట్టగా అప్పటి నుండి ఆయననే హోస్ట్‌గా ఉంటున్నాడు. అయితే ఈ షోకి హోస్ట్ నాగార్జున గుడ్ బై చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్ అన్ ఫెయిర్ ఎలిమినేషన్, దీనికితోడు మరికొన్ని అన్ ఫెయిర్ నిర్ణయాల విషయంలో నాగార్జున చాలా అసంతృప్తిగా ఉన్నారట నాగ్.
మరోవైపు షో పై కూడా నెటిజన్లు, ఆడియెన్స్ నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో నాగ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. గత సీజన్‌తో పోల్చితే ఈ సీజన్ రేటింగ్ పడిపోయిందనే కామెంట్లుకూడా వచ్చాయి. కంటెస్టెంట్లు, వారి ఆట తీరుపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. హోస్ట్ గా నాగ్ కూడా ఏం చేయలేకపోతున్నారనే కామెంట్స్ రాగా, రాను రాను షో రేటింగ్ పడిపోతున్న నేపథ్యంలో నాగ్ నిర్ణయం ఆసక్తిని రేకెత్తిస్తుంది. గత వారం బలమైన కంటెస్టెంట్ ఇనయని ఊహించని విధంగా ఎలిమినేట్ చేయడంతో ఆడియెన్స్ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఈ విషయంలో నాగ్ సైతం దీనిపై సీరియస్ అయ్యాడట.
నిర్వాహకుల ఆలోచనలకి, నాగ్‌కి అస్సలు సెట్ కాకపోవడంతో నాగార్జున.. బిగ్ బాస్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నారట. బిగ్ బాస్ మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. మూడు, నాలుగు, ఐదు, ఓటీటీ, ఆరో సీజన్ లకు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇదిలా ఉంటే నాగ్ స్థానంలో వచ్చే సీజన్‌కి విజయ్ దేవరకొండ హోస్ట్ గా చేస్తారని సమాచారం. బిగ్ బాస్ సీజన్ 7కి విజయ్ దేవరకొండ హోస్ట్ చేయబోతున్నారని వార్తలు వస్తుండాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం హౌజ్‌లో రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, రోహిత్, కీర్తి ఉన్నారు. వీరు టాప్ 5 కంటెస్టెంట్‌గా నిలిచారు. వీరిలో టైటిల్ విన్నర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…