బాహుబలి చిత్రం తర్వాత మళ్లీ సౌత్ ప్రేక్షకులు తలెత్తుకునేలా చేసిన చిత్రం కేజీఎఫ్. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్క పాత్రకి మంచి గుర్తింపు దక్కింది. ముఖ్యంగా రాఖీ భాయ తల్లి పాత్ర పోషించిన నటి పేరు మారు మ్రోగింది. అందుకు కారణం ఆమె సినిమాలో చాలా డీ గ్లామరస్‌గా కనిపించగా, రియల్ లైఫ్‌లో మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది. యశ్ చిన్నతనంలో అమ్మగా చేసిన నటి పేరు అర్చన జోస్.. కర్ణాటకలోని బెంగళూరులో 1994లో జన్మించారు.ఆమె బెంగుళూరులోని న్యూ ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేయగా, నాట్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కథాకళిలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు.
తమిళనాడులోని తంజావూరులో ఉన్న శాస్త్ర విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువును కూడా పూర్తి చేశారు. తొలిసారి ఈ నటి కన్నడ సీరియల్ మహాదేవితో నటించారు. ఆ సీరియల్‌లో సుందరి క్యారెక్టర్‌లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఆమె 2019లో యష్ నటించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 1 చిత్రంలో నటించి తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. 27 సంవత్సరాల అర్చన ఇందులో రాకీ తల్లి చందమ్మగా నటించడం విశేషం. చిన్న వయసులోనే ప్రముఖ హీరో క్యారెక్టర్‌కి తల్లిగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది అర్చన.
ఈ సినిమా తర్వాత అర్చనకి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నట్టు తెలుస్తుంది. ఇక కేజీఎఫ్ చిత్రంలో యశ్ మాస్ యాక్షన్‌కు తోడు ప్రశాంత్ టేకింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఈ ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఆల్ టైం హైయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 చిత్రం రూపొందగా, ఈ చిత్రం మంచి విజయం సాధించి అనేక రికార్డులని తన ఖాతాలో వేసుకుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…