మ‌ళ్లీ వివాదంలో దేవిశ్రీ ప్ర‌సాద్‌.. ఈసారి ఏమైంది.. కోరి గొడ‌వ‌లు తెచ్చుకుంటున్నాడా..?

త‌న సంగీతంతో కుర్ర‌కారుకి హుషారెక్కించే సంగీత ద‌ర్శ‌కుడు దేవి శ్రీ ప్ర‌సాద్ . మెగా ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని ఆయన సినిమాలకు దాదాపు దేవీనే మ్యూజిక్ అందించాలని కొందరు డైరెక్టర్లు కోరుతుంటారు. మెగా సినిమాలకే కాకుండా దేవి ఇతర సినిమాలకు కూడా మంచి సంగీతాన్ని అందించి కుర్రాళ్లలో జోష్ పెంచుతుంటాడు దేవి శ్రీ. ఇటీవ‌ల త‌న జోరు త‌గ్గ‌నా కూడా అడ‌పాద‌డ‌పా మెరుస్తూనే ఉన్నాడు. అయితే ఇటీవ‌ల కొంత ఖాళీ స‌మ‌యం దొర‌క‌డంతో ఆల్బ‌మ్స్ కూడా చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయన ఇటీవల ‘ ఓ పారి’ అనే అల్బమ్ ను తయారు చేశారు.

ఐటెం సాంగ్‌ని పోలి ఉన్న ఈ ఆల్బమ్‌లో ‘హరే రామ హరే కృష్ణ’ పదాల్ని వినియోగించడంపై సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి అభ్యంతరం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లోని హిందూ సంఘాలతో కలిసి ఆమె సైబర్ క్రైమ్స్‌లో దేవిశ్రీ ప్రసాద్‌పై ఫిర్యాదు చేసింది. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిన దేవిశ్రీపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో ఆమె పేర్కొంది. ‘హరే రామ హరే కృష్ణ’ హిందువులకి చాలా పవిత్రమైన మంత్రమని , దాన్ని ఐటెం సాంగ్‌ని పోలి ఉన్న ‘ఓ పరి’లో వాడటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

devi sri prasad in controversy again karate kalyani complaint

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఆ ఆల్బమ్‌లో పదాలు వాడిన దేవిశ్రీ ప్రసాద్ వెంటనే హిందువులకి క్షమాపణలు చెప్పాల‌ని ఆమె డిమాండ్ చేసింది. అంతే కాక అందులోని ‘హరే రామ హరే కృష్ణ’ పదాల్ని తొలగించాలని కూడా ఆమె డిమాండ్ చేసింది. ‘ఓ పారి’ అల్బమ్ లో విదేశీ మోడల్స్ నృత్యం ఉంటుంది. అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్ లాంటి దేశాల్లో దీనిని చిత్రీకరించారు. ఈ సాంగ్ పూర్తి బాధ్యతలు తనదేనని దేవి శ్రీ ఇదివరకే ప్రకటించారు. మ‌రి క‌రాటే క‌ళ్యాణి ఆరోప‌ణ‌ల‌పై దేవి శ్రీ ప్ర‌సాద్ ఏమ‌న్నా స్పందిస్తాడా అనేది చూడాలి.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 month ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 month ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 month ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago