Kesineni Nani : విజయవాడ రాజకీయం ఆసక్తి కరంగా మారుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. విజయవాడలో పూర్వ వైభవం సాధించాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. పట్టు నిలబెట్టుకోవాలని సీఎం జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరటంతో..వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు కేటాయించారు. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీని 60 శాతం ఖాళీ చేస్తానని కేశినేని మరోసారి చెప్పుకొచ్చారు. దీంతో నాని ఏం చేయబోతున్నారనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు బెజవాడలో అన్నాదమ్ముల్ల మధ్య సవాళ్లు.. ప్రతిసవాళ్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అన్న ఒకటంటే.. తమ్ముడు రెండంటూ పాలిటిక్స్ ను మరింత హీటు పెంచుతున్నారు.
విజయవాడలో టీడీపీ 60 శాతం ఖాళీ అవ్వడం ఖాయమంటూ వైసీపీ నేత కేశినేని నాని పేర్కొన్నారు. అవసరం అయితే వందశాతం ఖాళీ చేయిస్తాన్నారు. కేశినేని చిన్నివి ఉత్తరకుమార ప్రగల్భాలు అంటూ పేర్కొన్న నాని… తన స్థాయి చంద్రబాబు స్థాయి.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు పడితే వాళ్లకు సమాధానం ఇవ్వనంటూ. బుద్ధా వెంకన్న, కేశినేని చిన్నిపై నాని సెటైర్లు వేశారు. కాల్ మనీ వ్యాపారస్తుల మాటలకు స్పందించాల్సిన అవసరం తనకు లేదని.. తన గురించి మాట్లాడే వాళ్లు.. వాళ్ల స్థాయి ఏంటో తెలుసుకుంటే బాగుంటుందని కేశినేని నాని పేర్కొన్నారు. అయితే కేశినేని నాని టీడీపీలో ఉన్నప్పుడు, స్వతంత్రంగా వ్యవహరించేవారు. తాను చంద్రబాబుతో సమాన స్థాయి ఉన్న నేతగా భావించుకునే వారు. ఆ కారణంగానే పార్టీలో సీనియర్లు చాలా మంది ఆయనకు దూరంగా మెలిగే వారు.
అయితే అదంతా కేశినేని బిల్డప్ మాత్రమేనని వైసీపీ గూటికి చేరిన రోజుల వ్యవధిలోనే బట్ట బయలైపోయింది. విజయవాడ ఎంపీగా తనతోపాటు.. మరో ఐదుగురు నేతలకు, అసెంబ్లీ సీటు ఇవ్వాలని ఆయన వైసీపీ అధినేతకు సిఫార్సు చేయడంతో ససేమిరా అన్న సర్దుకు పోయారు. ఇక ఇటీవల బెజవాడలో జరిగిన పలు వైసీపీ కార్యక్రమాలకు కేశినేని నాని హాజరు కాగా,ఆయన పరిస్థితి గుంపులో గోవిందా అన్నట్టు మారింది. టీడీపీలో ఉన్నప్పుడు ఆయనకు మంచి గౌరవం ఉండేది. వైసీపీలో మాత్రం లాంటి ప్రాధాన్యతా లభించడం లేదు. విజయసాయిరెడ్డి ముందు వరసలో ఉండి, మీడియాతో మాట్లాడితే… స్వతంత్ర భావాలుండి, ఎక్కువ ప్రాధాన్యం కోరుకునే కేశినేని నాని మాత్రం.. ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెనుక నిలబడి ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల జరిగిన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీగా ఇవ్వాల్సిన ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా వైసీపీ నానిని మరింత ఘోరంగా అవమానించడంతో ఆయన మానసికంగా కుంగిపోతున్నట్టుగా అర్ధమవుతుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…