Shoiab Malik : షోయ‌బ్ మాలిక్ రెండో పెళ్లిపై సానియా మీర్జా కుటుంబ స‌భ్యులు ఏమంటున్నారంటే..?

Shoiab Malik : ఇటీవ‌లి కాలంలో చాలా జంట‌లు పెళ్లైన కొద్ది రోజుల‌కే విడాకులు తీసుకుంటుండ‌డం మ‌నం చూశాం. రీసెంట్‌గా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వైవాహిక జీవితం విషాదాంతంగా ముగిసింది. సానియా మీర్జా తన 15 ఏళ్ల దాపంత్య జీవితానికి గుడ్ చెప్పింది. భర్త షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకోవడంతో .. అతనితో సానియా మీర్జా బంధం తెగిపోయినట్టు అయింది. షోయబ్ మాలిక్ పాకిస్థాన్‌కు చెందిన హీరోయిన్ సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు.సనా జావేద్‌తో షోయబ్ మాలిక్ ఎఫైర్ పెట్టుకున్నాడని..ఆ కారణంగానే సానియా మీర్జాతో అతను దూరంగా ఉంటున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ సనా జావేద్‌‌ను షోయబ్ పెళ్లాడాడు. ఇదిలా ఉంటే సానియా మీర్జా – షోయబ్ మాలిక్ విడాకులపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ప్రేమించిన అమ్మాయిని మోసం చేయడానికి షోయబ్‌కు సిగ్గు లేదని కొందరు కామెంట్ చేస్తుంటే.. మరి కొందరు పాకిస్థాన్‌ వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ఇలాగే జరగాలంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. పెళ్లి తరువాత సానియా మీర్జా పాకిస్థాన్‌లో కన్నా ఇండియాలో ఎక్కువుగా కనిపించినప్పుడే సానియా జంట విడిపోవడం ఖాయమని భావించామని మరి కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తుంటారు. షోయబ్ మాలిక్, పాక్ నటి సనా జావెద్ ను పెళ్లాడినట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలు సందడి చేస్తున్నాయి. ఇటీవల సానియా ఇన్ స్టాగ్రామ్ లో విడాకుల గురించి పోస్టు పెట్టడం, ఇప్పుడు షోయబ్ రెండో పెళ్లి ఫొటోలు తెరపైకి రావడంతో సానియా విడాకులపై ఓ స్పష్టత వచ్చింది.

sania mirza family responded on Shoiab Malik second marriage
Shoiab Malik

దీనిపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా మరింత స్పష్టతనిచ్చారు. తన కుమార్తె సానియా ‘ఖులా’ (విడాకులు) ను ఎంచుకుందని వెల్లడించారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం… ముస్లిం మహిళలు భర్త సమ్మతితో పని లేకుండా అతడి నుంచి విడిపోవడాన్ని ‘ఖులా’ అంటారు. ముస్లిం మహిళలకు ఆ మేరకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. ఇప్పుడు సానియా కూడా ఈ మార్గాన్నే ఎంచుకున్నట్టు ఆమె తండ్రి మాటల ద్వారా అర్థమవుతోంది. భారత మహిళా టెన్నిస్ కు అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు అందించిన సానియా… 2010 ఏప్రిల్ 12న పాకిస్థాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడింది. వీరికి ఇజాన్ మీర్జా మాలిక్ అనే కుమారుడు ఉన్నాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago