Kesineni Nani : వైసీపీ నేత, ఎంపీ కేశినేని నాని ఇటీవల సంచలన వ్యాఖ్యలతో వార్తలలో నిలుస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నాయకులతో పాటు వారి ఛానెల్స్‌పై అలానే కొందరు చేసే కామెంట్స్‌పై కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధిపై దమ్ముంటే తనతో చర్చకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్ కు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఎవరిది స్వర్ణయుగమో, ఎవరిది రాతియుగమో తేల్చుకుందాం అన్నారు. దీనిపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. జగన్ దాకా ఎందుకు… చర్చకు నేను సిద్ధం అంటూ చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. అమరావతిలో సచివాలయం కడితేనే అభివృద్ధి అంటారా? లేక, గ్రామ గ్రామానికి ఓ సచివాలయం కడితే అభివృద్ధి అంటారా? అని ప్రశ్నించారు.
ఎటు చూసినా జగన్ చేసిన అభివృద్ధి కనిపించడంలేదా? అని నిలదీశారు. ఏదో ఈనాడు పేపర్ మన చేతిలో ఉంది కదా అని రాసేస్తున్నారని మండిపడ్డారు. ఆ రోజున ముఖ్యమంత్రిని లొంగదీసుకుని ఈనాడు పేపర్ ద్వారా రామోజీరావు 2 వేల ఎకరాల్లో పెద్ద కోట కట్టుకున్నాడని, ఆ కోటలోంచి రామోజీరావు ఆంధ్రాను చూస్తుంటాడని కేశినేని నాని విమర్శించారు. తన కోట అభివృద్ధిని చూసుకున్న రామోజీరావుకు ఇవన్నీ అభివృద్ధి కింద కనిపిస్తాయా అని వ్యంగ్యం ప్రదర్శించారు. ఆ కోట లోపల ప్రత్యేకంగా ఒక విమానాశ్రయమే ఉంది, రామోజీ ఫిలిం సిటీయే ఉంది అని అన్నారు.
“అందుకే ఆయన చంద్రబాబు చేసిందే అభివృద్ధి అనుకుంటున్నాడు, అంటూ కేశినేని చెప్పుకొచ్చాడు. ఇక బీసీలకి ఛాన్స్ ఇవ్వడం లేదంటూ కొందరు మాట్లాడుతున్నారు. నా పక్కన ఉంది ఎవరు. మీరు ఎవరో గొట్టంగాడి దగ్గరకు వెళ్లి వారు ఏదో మాట్లాడితే ఆ గొట్టం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అడిగితే ఎలా, మీరు కూడా విశ్లేషణ చేయాలి కదా నాని ఫైర్ అయ్యారు. జగన్ అందరికి సమన్యాయం చేస్తాడు. అంతేకాని ఎవరు ఏదో మాట్లాడడం దానికి సమాధానం చెప్పడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…