ఇటీవలి కాలంలో సెలబ్రిటీల చిన్ననాటి పిక్స్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. హీరోలు, హీరోయిన్స్ పిక్స్ అభిమానుల మతులు పోగొడుతున్నాయి.ఒక హీరోయిన్ చిన్నప్పటి పిక్ కనిపిస్తేనే అభిమానులు పిచ్చెక్కినట్టు ఊగిపోతుంటారు. అలాంటిది ఇద్దరు భామల చిన్నప్పటి పిక్స్ ఒకే ఫ్రేములో కనిపిస్తే ఆ ఆనందం ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తాజాగా స్టార్ హీరోలతో జోడీ కడుతూ పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిన ఓ హీరోయిన్, మరో బ్యూటీ సొంతభాషలో హిట్స్ కొడుతూ దుసుకుపోతున్న హీరోయిన్ చిన్నప్పుడు కలిసి కట్టుగా ఫొటో దిగగా, ఒకే ఫ్రేములో కలిసి కనిపిస్తున్న ఈ జంట చూసి ఎవరా అని ఆశ్చర్యపోతున్నారు.
ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరు చిన్నారులలో నిలుచున్న పాప కీర్తి సురేష్, కూర్చున్న అమ్మాయి కల్యాణి ప్రియదర్శన్. కేరళలో పుట్టి పెరిగిన ఈ ఇద్దరూ తెలుగు సినిమాలతోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలు అందుకున్నారు.. ‘నేను శైలజ’ కీర్తి హిట్ కొట్టగా.. అఖిల్ ‘హలో’తో కల్యాణి టాలీవుడ్ లోకి పరిచయమైంది. కీర్తి, కల్యాణి.. ఇద్దరి తల్లిదండ్రులు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందినవాళ్లే కావడంతో వీరికి సినిమాలు అవకాశాలు ఈజీగా వచ్చాయి. వీళ్లకు చిన్నప్పటినుంచే పరిచయం ఉండగా,ఆ రిలేషన్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు.
‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ అమాంతం పెరిగిపోగా, ఇప్పటి వరకు పలువురు స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. తాజాగా వచ్చిన ‘దసరా’తో పాన్ ఇండియా హిట్ కొట్టేసింది. ప్రస్తుతం ఈమె మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా నటిస్తోంది. కళ్యాణి ప్రియదర్శన్ మాత్రం స్లోగా సినిమాలు చేస్తోంది. ‘హలో’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మలయాళంలో నటిస్తూ బిజీగా ఉంది కీర్తి సురేష్ కెరీర్ బాగానే ఉన్నప్పటికీ, కళ్యాణి మాత్రం ఇంకా కెరియర్‌లో ఎదగాల్సి ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…