Conductor Jhansi : టాలెంట్ ఉన్న చాలా మంది అవకాశాలు రాక ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీ షోతో కొత్త టాలెంట్ బయటకు వస్తుంది. అలాంటి వారిలో ఒకరు కండక్టర్ ఝాన్సీ. కండక్టర్ ఝాన్సీ అంటే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, పల్సర్ బైక్ ఝాన్సీ అంటే మాత్రం ప్రతి ఒక్కరు ఈజీగా గుర్తు పడతారు. ఒకే ఒక్క పాటతో ఆమె ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇరు రాష్ట్రాల్లో ఆమె పేరు ఇప్పుడు మార్మోగిపోతుంది. ఝాన్సీ తన జీవితంలో ఎన్నో కష్టాలు పడడంతో పాటు మరెన్నో అవమానాలకు గురయ్యింది.
ఎన్నో అవమానాలని సైతం ఎదుర్కొని పల్సర్ బైక్ సాంగ్ తో బాగా పాపులర్ అయ్యింది. గాజువాకలో కండక్టర్ గా విధులు నిర్వహించిన ఝాన్సీ, ఓవర్ నైట్ స్టార్ గా మారిన ఝాన్సీ వీలుప్పుడల్లా తన డ్యాన్స్ తో అందరినీ అలరించేది. ఎన్నో పాటలకు డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. పల్సర్ బైక్ అనే పాట ఆమె కెరీర్ కు ఓ టర్నింగ్ పాయింట్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ పాటతో ఆమె ఎంతో మంది అభిమానులను సంపాధించుకోవడంతో పాటు పలు టీవీ షోలలో డ్యాన్సర్ గా పాల్గొనే అవకాశాలు కూడాదక్కించుకుంది. అయితే ఝాన్సీ డ్యాన్స్ చేసిన పల్సర్ బైక్ పాటను రవితేజ మూవీ ‘ధమాకా’లోనూ పెట్టారంటే ఆ సాంగ్ ఎంత బాగా పాపులర్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా సూపర్ క్వీన్ సీజన్ 2 షోలో పాల్గొన్న ఝాన్సీ.. తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాన్ని గురించి చెబుతూ.. ఒక టైలర్ తన పట్ల తప్పుగా ప్రవర్తించాడని ఆమె వెల్లడించారు. తనకు ఈ స్టార్ డం రావడం వెనక 18 ఏళ్ల కష్టం ఉందని కండక్టర్ ఝాన్సీ వెల్లడించారు. ఒకసారి తాను టైలర్ షాప్ కి వెళ్ళినప్పుడు ఆ సమయంలో తన తండ్రి లేరని.. టైలర్ షాప్ వ్యక్తి కొలిచే కొలతల్లో తప్పు ఉందని చెప్పారు అంటూ ఝాన్సీ పేర్కొంది. తన తండ్రితో చెప్పి టైలర్ ను కుట్టిద్దామని అనుకున్నానని, కానీ అదే నాన్న వచ్చి నేను నీ తండ్రిని కాదని చెప్పు అన్నారని చెబుతూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏప్రిల్ 9న ప్రసారం కానున్న ఈ షోలో అనేక ఆసక్తికర విషయాలు బయటపెట్టనుంది. ఇక ఈ షోకి అతిథిగా కాజల్ అగర్వాల్ రానుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…