KCR : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు. ఎలక్షన్స్ తర్వాత ఆయన బాత్ రూంలో జారిపడి తొంటికి చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. తుంటి ఎముక విరగడంతో సోమాజిగూడలో యశోద ఆస్పత్రిలో ఆయనకు సర్జరీ జరిగింది. అప్పటి నుంచి ఆయన నందినగర్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.ప్రస్తుతం ఆరోగ్యం పూర్తిగా కుదుట పడడంతో పార్టీలో మళ్లీ క్రియాశీల పాత్ర పోషించబోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన గురువారం స్పీకర్ చాంబర్‌లో ప్రమాణస్వీకారం చేశారు. త్వరలోనే పార్టీ కార్యక్రమాల్లోనూ బిజీ కాబోతున్నారు.
ఈ క్రమంలో నేడు ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ చేత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్ కారుదిగి నమ్మెదిగా నడుచుకుంటూ తన చాంబర్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ వెంట బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనాచారి, మల్లారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కేసీఆర్ తన చాంబర్ లో ప్రత్యేక పూజల అనంతరం స్పీకర్ కార్యాలయంకు వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.
డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి బరిలో ఉన్నారు. కానీ కామారెడ్డిలో మాత్రం ఓడిపోయారు. అంతేకాదు..రాష్ట్రంలో కాంగ్రెస్ అధిక సీట్లు గెలవడంతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. అయితే కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో కేసీఆర్ అసెంబ్లీకి చేరుకొని, శాసనసభాపక్ష నేతగా ఆయనకు కేటాయించిన చాంబర్ లో కేసీఆర్ ముందుగా పూజలు చేశారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్ కు చేరుకొని మధ్యాహ్నం 12.40 గంటలకు కేసీఆర్ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…