CM Revanth Reddy : కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వ‌ద్ద‌కు సీఎం రేవంత్ రెడ్డి..!

CM Revanth Reddy : కుమారి ఆంటి.. ఇటీవ‌లి కాలంలో ఈ పేరు ఎక్కువ‌గా వినిపించే పేరు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి ఈ పేరు చాలా సుప‌రిచితం. హైదరాబాద్‌లోని కేబుల్‌ బ్రిడ్జి పరిసరాల్లో స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారం చేస్తున్న ఆమె సూపర్ ఫేమస్ అయింది. యూట్యూబ్‌ ఛానెల్స్ ఆమెను బాగా ప్రమోట్ చేశాడు. దీంతో ఫుడ్ లవర్స్ ఫోటెత్తారు. కేవలం హైదరాబాద్ వాళ్లే కాదు.. ఇతర ప్రాంతాల నుంచి సైతం ఈమె వద్ద ఫుడ్ టేస్ట్ చూసేందుకు ప‌రుగులు పెట్టారు. సెలబ్రిటీలు కూడా కుమారి ఆంటీ ఫుడ్‌ తినేందుకు ఆసక్తి చూపడ‌మే కాదు, ఆమెతో త‌మ సినిమాలు ప్ర‌మోష‌న్స్ కూడా చేయించుకుంటున్నారు.

ఈ క్ర‌మంలోనే ఆ ప్రాంతంలో క్రౌడ్ పెరిగిపోయింది. ట్రాఫిక్ సమస్య వాటిల్లింది. దీంతో కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగి.. రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని తేల్చిచెప్పేశారు. మరో ప్రాంతానికి ఫుడ్ స్టాల్ మార్చాలని డిసైడ్ చేశారు. దీంతో ఆమె తన పొట్ట కొడుతున్నారని వాపోయింది. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. పోలీసుల చర్యతో కుమారి ఆంటీకి అన్యాయం జరిగిందని.. ఆమె ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేయం దారుణమని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. చిరు వ్యాపారిపై ఇలాంటి చర్యలకు దిగటం సరైంది కాదని కామెంట్లు పెడుతున్నారు. దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఆమెకు బాసటగా నిలిచారు.

CM Revanth Reddy visits kumari aunty food stall
CM Revanth Reddy

కుమారి ఫుడ్ స్టాల్ అక్కడి నుంచి తీసేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆమె ఫుడ్ స్టాల్‌ను మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అధికారులను ఆదేశించారు. కుమారిపై పెట్టిన కేసు విషయాన్ని కూడా పునఃపరిశీలన చేయాలని డీజీపీని ఆదేశించారు. మెున్నటి వరకు కుమారి ఎక్కడైతే స్టాల్ పెట్టుకుందో ఆ స్థానంలోనే వ్యాపారం చేసుకునేదుకు అవకాశం ఇవ్వాలని ఎంఏయూడ‌గీ అధికారులను కూడా ఆదేశించారు. ప్రజాపాలనలో సామాన్యులకి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న సీఏం.. త్వరలోనే ఆమె స్టాల్‌ను సందర్శిస్తానని చెప్పారు. ఈ మేరకు సీఎంవో నుంచి ప్రభుత్వ సీపీఆర్వో అయోధ్య రెడ్డి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఉన్న చోటి నుంచే కుమారి ఆంటీ తన వ్యాపారాన్ని కొనసాగించవచ్చని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో ఆయన మరో అడుగు ముందుకేశారు. కుమారి ఆంటీ ఫుడ్‌ స్టాల్‌ను సందర్శిస్తానని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago