Anupama Parameswaran : రవితేజ తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. ఈ సినిమా టీజర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా మరి కొద్ది రోజులలో విడుదల కానుంది. ఈ మూవీ డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. టైగర్ నాగేశ్వర్ రావు’తో పెద్ద డిజాస్టర్ అందుకున్న రవితేజ ప్రస్తుతం మరో పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనితో కలిసి చేస్తున్న ‘ఈగల్’ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో కీలక పాత్రలో కావ్య థాపర్ కనిపించబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది.
‘ఈగల్’ ప్రమోషన్ కోసం ఏకంగా హీరోయిన్ అనుపమను రంగంలోకి దింపింది మూవీ యూనిట్. ఆమెతో ఫన్నీ ప్రమోషనల్ ఇంటర్వ్యూ సిరీస్ ను మొదలు పెట్టింది. అందులో భాగంగా విడుదలైన ఓ వీడియోలో తన సినిమాతో పాటు సోషల్ మీడియా ప్రమోషన్ ను ఎలా చేయాలో వివరిస్తూ పీఆర్ కు క్లాస్ తీసుకుంది. ‘పొగ ఈగల్ ప్రచార సెగ’ పేరుతో విడుదలైన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది. వీడియో ప్రారంభం కానగానే, అనుపమ నడుచుకుంటూ పీఆర్ ఛారంబర్ కు వెళ్తుంది. “పీఆర్ పొగ అంటే నువ్వేనా? అని అడుగుతుంది.
అతడు నేనే మేడం అని చెప్తాడు. నేనే మీ దగ్గరికి రావాలి.. మీరు నా దగ్గరికి వచ్చారు ఏంటి మేడం? అంటాడు. ప్రమోషన్ కు ఏం ప్లాన్ చేశావ్? ఎట్ల తీసుకొస్తావ్ అటెన్షన్? ఎట్ల పెంచుతున్నావ్ అట్రాక్షన్? బజ్ జెనరేటింగ్ ఐడియాలు ఏంటి? అని ప్రశ్నల మీద ప్రశ్నలు చేస్తుంది. ముఖంలో ఓ ఐడియా లేదు. ప్లానింగ్ లేదు. యూజ్ లెస్. పేరు పక్కన ఉన్న పీఆర్ తీసెయ్ అని వార్నింగ్ ఇస్తుంది. 24 గంటల్లో తన ఇన్ స్టా వీడియో వ్యూస్ డబుల్ కావాలి అంటుంది. అంతేకాదు, దానికి ఏం చేయాలో కూడా చెప్తుంది. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.అయితే మూవీ ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం చేస్తున్న వెరైటీ ప్రమోషన్స్ అందరిని ఆశ్చర్యపరుస్తు్న్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…