Chiranjeevi : చిరంజీవా.. మ‌జాకానా.. ఈ వయ‌స్సులో కూడా అంత భారీ వ‌ర్క‌వుట్స్ చేస్తున్నాడేంటి..?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. స్వ‌యంకృషితో ఈ స్థాయికి చేరుకున్నారు. గత ఏడాది వాల్తేరువీరయ్య, భోళా శంకర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ రెండింటిలో వాల్తేరు వీరయ్య సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇక భోళాశంకర్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక తన తదుపరి సినిమాలపై ఫోకస్ చేశాడు. ప్రస్తుతం వశిష్టతో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక ఈ కొత్త ఏడాది ప్రారంభంలోనే గుడ్ న్యూస్ విన్నారు. ఈ 2024లో చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డ్ వరించిన విషయం తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీతోపాటు ఆయన అభిమానులు తెగ సంబరపడిపోయారు.

తాజాగా న‌టిస్తున్న చిత్రం విశ్వంభ‌రకాగా, ఈ మూవీ మెగా ఫాంటసీ అడ్వెంచర్ జాన‌ర‌ల్‌లో వ‌స్తుంది. ఈ చిత్రానికి బింబిసార వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని రూపొందించిన వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా గ‌త సంవ‌త్స‌రం అధికారికంగా షూటింగ్ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి ఇటీవ‌లే సంక్రాంతి ప‌ర్వ‌దినం నాడు విశ్వంబ‌ర అనే టైటిల్‌ను ఖ‌రారు చేస్తూ గ్లింప్స్ అండ్ కాన్సెప్ట్ వీడియో అధికారికంగా విడుద‌ల చేశారు. గతంలో విడుదల చేసిన పోస్టర్‌తోపాటు ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అంతేకాకుండా ఆ గ్లింప్స్ మూవీపై క్యూరియాసిటీ కలిగేలా చేసింది.

Chiranjeevi latest workouts video viral
Chiranjeevi

చిరంజీవి ఇంకా విశ్వంభర సెట్స్‌లో అడుగుపెట్టలేదు. అయితే తాజాగా ఆయన సెట్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా ఓ వీడియో ద్వారా చెప్పారు. విశ్వంభర మూవీ కోసం సరికొత్తగా రెడీ అవుతున్నారు. అందుకు గానూ ఎప్పుడు చేయని విధంగా భారీ కసరత్తులు చేస్తున్నారు చిరంజీవి. దీనికి సంబంధించిన వీడియోను చిరంజీవి తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. అంతేకాకుండా ఆ వీడియో చివరిలో విశ్వంభర కోసం రెడీ అవుతున్నాను అని తెలిపారు. ఆ వీడియోలో భారీ కసరత్తులు చేస్తూ చెమటలు చిందించారు మెగాస్టార్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి 68 ఏళ్లు. 68 ఏళ్ల వయసులోనూ సినిమా కోసం పద్మవిభూషణ్ చిరంజీవి పడే కష్టం చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago