Kavya Kalyanram : ఇటీవల కొందరు భామలు ఒక్క సినిమాతోనే లైమ్‌లైట్‌లోకి వస్తున్నారు. అలా బలగం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ కావ్య కళ్యాణ్ రామ్. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైనటువంటి కావ్య కళ్యాణ్ రామ్ బలగం సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా గంగోత్రి సినిమాలో నటించారు.అలాగే పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో కూడా నటించి సందడి చేశారు. ఇలా పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కావ్య కళ్యాణ్ రామ్ మసూద్ సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
వివి వినాయక్ చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన ఠాగూర్ సినిమాలో కూడా కావ్య కళ్యాణ్ రామ్ నటించింది. ఈ అమ్మడు తాజాగా తన డ్యాన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. కావ్య మాస్ డ్యాన్స్ చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. చింపేసావు పో అంటూ కామెంట్స్ చేస్తున్నరు. ఇటీవల ఈ బ్యూటీ తన అందచందాలతోను కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతుంది. ఇటీవల ఈ అమ్మడు కొన్ని బోల్డ్ కామెంట్స్ కూడా చేసింది. డబ్బులు ఎక్కువగా ఇస్తానంటే ఇంటిమేట్ సన్నివేశాలు,బోల్డ్ సీన్స్, బెడ్రూమ్స్ సన్నివేషాల్లో కూడా నటించడానికి ఓకే అంటూ బోల్డ్ కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు రెమ్యూనరేషన్ ఎక్కువగా డిమాండ్ చేస్తే బికినీలు వేయడానికైనా బెడ్రూమ్స్ సీన్స్,రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి ఏ మాత్రం వెనకాడడం లేదు.. అందుకే కావ్య కళ్యాణ్ రామ్ కూడా అలా మాట్లాడింది అంటూ ఆమెను కొంతమంది సమర్థిస్తున్నారు.16 చిత్రాల్లో బాలనటిగా నటనతో మెప్పించిన కావ్య ఇప్పుడు హీరోయిన్‌గా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుంది. మరి మంచి రోజులు కలిసి వస్తే కావ్య కూడా స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరడం ఖాయమంటున్నారు.