Rao Gopal Rao : ప్రభాస్. కృతి సనన్ ప్రధాన పాత్రలలో రూపొందిన పీరియాడికల్ మూవీ ఆదిపురుష్. సంక్రాంతికి విడుదల కావలసిన ఈ మూవీ పలు కారణాల వలన వాయిది పడుతూ వచ్చి జూన్ 16న థియేటర్స్ లో రిలీజ్ అయింది. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ‘ఆదిపురుష్’ మూవీ దాదాపు 7000లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు. దీనికి ఆరంభంలో మిక్స్‌డ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం భారీగానే వస్తున్నాయి. ఫలితంగా ఇది ఫస్ట్ వీకెండ్‌లోనే రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సత్తా చాటుకుంది. చూస్తుంటే ఈ వారం ఆదిపురుష్ చిత్రం సేఫ్ జోన్‌లో పడుతుందని చెబుతున్నారు.
ఆదిపురుష్ చిత్రంపై అనేక విమర్శలు వచ్చాయి. హనుమంతుడు వాడిన డైలాగులు, రావణాసురుడి పది తలలు ఇలా ఎన్నో అంశాలపై ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఈ సినిమాపై వ్యతిరేకత బాగా పెరుగుతూ వస్తోంది. ఖాట్మండు మేయర్ బాలెన్ షా తన ట్వీట్‌లో ‘ఆదిపురుష్‌లోని ఆ డైలాగును మార్చకుంటే ఖాట్మండు మెట్రోపాలిటన్ సిటీలో ఈ సినిమాను నిషేదించినట్లుగానే.. భవిష్యత్‌లోనూ ఏ హిందీ సినిమాను నడపడానికి అనుమతించం’ అని వార్నింగ్ ఇచ్చారు.. అందుకు తగ్గట్లుగానే థియేటర్ల యాజమాన్యాలు కూడా కట్టుబడి ఉన్నాయి.
![Rao Gopal Rao : ఆదిపురుష్ సినిమా గురించి రావు గోపాల్ రావు అప్పట్లోనే చెప్పారు..! Rao Gopal Rao told already about aadipurush movie](http://3.0.182.119/wp-content/uploads/2023/06/rao-gopal-rao.jpg)
అయితే ఆదిపురుష్ గురించి పలు వివాదాలు నడుస్తున్నప్పటికీ ఈ సినిమాకి సంబంధించి అనేక ప్రచారాలు సాగుతున్నాయి. ఆదిపురుష్ స్టోరీ రావు గోపాల్ రావు గారు అప్పట్లో చెప్పారని ఓ వీడియో చూస్తే తెలుస్తుంది. తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియోలో రామ్ గోపాల్ రావు.. గోదావరి ఎలా ప్రవహిస్తుంది, ఎక్కడ ఏమేం స్థలాలు ఉన్నాయి అనేవి చెబుతారు. అయితే రామ్ గోపాల్ వర్మ ఈ వీడియోలో మాయమాటలు చెప్పి ఎలా డబ్బులు సంపాదిస్తున్నారో ఇప్పుడు ఆదిపురుష్ మేకర్స్ కూడా అలానే స్పందిస్తున్నారని తెలియజేస్తున్నారు.