ఇటీవల సెలబ్రిటీలు నిర్మొహమాటంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు గురించి చెప్పేస్తూ అభిమానులని ఆందోళనకు గురి చేస్తున్నారు. కోలీవుడ్ నటి కస్తూరి శంకర్ కూడా తన అనారోగ్యం గురించి నోరు విప్పింది.. దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ సినిమాలు చేసిన ఈ భామ.. ఇప్పుడు స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న సూపర్ హిట్ సీరియల్ ‘ఇంటింటి గృహలక్ష్మి’లో లీడ్ రోల్ చేస్తూ అలరిస్తుంది అంతేకాదు మరికొన్ని ఆఫర్లతోనూ ఫుల్ బిజీగా గడుపుతోంది. చిన్న వయసులోనే కస్తూరి మిస్ చెన్నైగా ఎంపిక కాగా, అనంతరం ఆమెకు సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి.
‘ఆతా ఉన్ కోయిలిలే’ అనే తమిళ చిత్రంతో నటిగా పరిచయమైంది. ఆ వెంటనే ‘చక్రవర్తి’ అనే మలయాళ చిత్రంలో నటించి, ఆ తర్వాత ‘గ్యాంగ్ వార్’ అనే సినిమాతో తెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కన్నడ చిత్రాల్లోనూ నటించి ఫేమస్ అయింది. అయితే సీరియల్స్‌తో బాగా ఫేమస్ అయిన కస్తూరి తనకి చికెన్ పాక్స్ (అమ్మవారు) సోకిందని.. ఇది చాలా ప్రాణాంతకరమైనదని చెప్పింది కస్తూరి. ఈ వ్యాధి సోకితే చాలా శరీరం వికృతంగా ఉంటుందని.. శరీరం మొత్తం మచ్చలు, మొటిమలు వస్తాయని.. అదృష్టవశాత్తూ తన కళ్లపై అవి రాలేదని చెప్పుకొచ్చొంది కస్తూరి. త్వరలో సాధారణ స్థితికి చేరుకుంటున్నట్టు చెప్పింది కస్తూరి. ఈ సందర్భంగా తనకి మద్దతు ఇచ్చి అండగా నిలిచిన వారికి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌కి కృతజ్ఞతలు తెలిపింది కస్తూరి.
అయితే బుంగమూతి పెట్టి ఫొటోలకు ఫోజులు ఇవ్వడంతో ఎప్పటిలాగే కస్తూరి పోస్ట్‌పై కొంత నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆమెకి అమ్మవారు సోకడంతో వారం రోజుల పాటు విశ్రాంతి తప్పనిసరి. షూటింగ్‌కి అంతరాయం ఏర్పడినట్టే కదా. తులసి లేకపోతే సీరియల్ నడవదు అనేంత గొప్పగా అయితే ‘గృహలక్ష్మి’ లేదు. ఈ మధ్య కాలంలో కూడా కస్తూరి ఏజ్‌కు తగ్గ పాత్రలు చేస్తోంది. గత ఏడాది ఈ భామ ‘గాడ్ ఫాదర్’ మూవీలో చిరంజీవికి తల్లిగా చేసింది. మరోవైపు, ఈ సీనియర్ హీరోయిన్ తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…