Sir Movie : తమిళ స్టార్ హీరో ధనుష్ తన కెరీర్‌లో వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు. తాజాగా ఆయన సార్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విద్యను వ్యాపారంగా మార్చుతోన్న వారిపై ఓ సాధారణ లెక్చరర్ సాగించిన పోరాటం నేపథ్యంలో కమర్షియల్ మెసేజ్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. తెలుగు, తమిళంలో విడుదలైన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది. రెండు భాషల్లో పెయిడ్ ప్రీమియర్స్‌కు చక్కటి రెస్పాన్స్ లభిస్తోంది. కాగా ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నది.
తమిళం, తెలుగు భాషల్లో ధనుష్ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉండటంతో భారీ మొత్తానికి ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. మార్చి నెలాఖరున లేదా ఏప్రిల్ ప్రథమార్థంలో సార్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. సార్ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా, ఇందులో ధనుష్‌కు జోడీగా సంయుక్త హీరోయిన్‌గా నటించింది. సముద్రఖని, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటించారు. సుమంత్ గెస్ట్ రోల్‌లో నటించాడు. ఈ ద్విభాషా సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
సార్ సినిమాకి పాజిటివ్ రివ్యూలు రావడంతో ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.16.54 కోట్లు వసూలు చేయడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా వీకెండ్‌లో ఇది రూ.51కోట్ల గ్రాస్ వసూలుచేయడం మరో విశేషంగా చెప్పుకోవాలి.. తెలుగులో ఇప్పటి వరకూ రిలీజైన ధనుష్ మూవీస్ అన్నింటిలోకీ ఈ సార్ మూవీ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది.. తొలి రోజే రికార్డు ఓపెనింగ్ అందుకున్న ధనుష్.. మూడు రోజులూ అదే కొనసాగించాడు. ట్రేడ్ వర్గాల్లో చెప్పుకునే దాని ప్రకారం సార్ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి వెళ్లిందని అంటున్నారు. మంచి హిట్ కోసం కొన్నాళ్లుగా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ధనుష్‌కి ఈ చిత్రం మంచి రిలీఫ్ ఇచ్చినట్టైంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…