Karate Kalyani : సీనియ‌ర్ ఎన్టీఆర్ విగ్ర‌హ ఏర్పాటుని అడ్డుకుంటామ‌న్న క‌రాటే క‌ళ్యాణి

Karate Kalyani : ఖమ్మంలో శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణను నిలిపివేయాలని అఖిల భారత యాదవ సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలు కరాటే కళ్యాణి అన్నారు.దేవుని రూపంలో ఉన్న రాజకీయ వ్యక్తిని ఆరాధించడం తమ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయని ఆమె కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని.. అయితే కృష్ణుడు రూపంలో పెట్టడం సరికాదని అంటున్నారు. దీని వెనుక రాజకీయ ప్రయోజనం ఉందని..యాదవ, కమ్మ సామాజిక వర్గాల ఓట్లు కోసమే ఈ రూపంలో ఏర్పాటు చేస్తున్నారని ఆమె అన్నారు.

భ‌గవంతుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ప్రారంభాన్ని మంత్రి పువ్వాడ నిలిపి వేయ‌క‌పోతే మేము అడ్డుకుంటామని హెచ్చరించారు క‌రాటే క‌ళ్యాణి. అస‌లు అక్క‌డ‌కి జూనియర్ ఎన్టీఆర్ ఎలా వస్తాడని..ఆయన కూడా ఆలోచించు కోవాలని కోరారు. మ‌రి క‌రాటే క‌ళ్యాణి వ్యాఖ్య‌ల త‌ర్వాత ఇప్ప‌డు ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ప్రారంభిస్తారా లేదా అనేది అంద‌రిలో సందేహం నెల‌కొంది. కాగా, మే 28న నందముూరి తారకరామారావు వందో జయంతిని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు ఘనంగా వేడుకలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Karate Kalyani says she will stop sr ntr statue launching
Karate Kalyani

ఇందులో భాగంగానే ఖమ్మంలోనూ మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్న గారి ఖ్యాతిని ప్రతిబింబించేలా 54 అడుగులు విగ్రహాన్ని లకారం చెరువులో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మం కోసం తానా సభ్యులు, కొందరు ఎన్నారైలు, పారిశ్రామిక వేత్తలు ఇందులో తమవంతు సాయం అందిస్తున్నారు. ఇందుకోసం సుమారు నాలుగు కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ విగ్రహం రూపు దిద్దుకుంటుండ‌గా, ఈ విగ్రహావిష్కరణలో ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ పాల్గొననున్నారు. ఓవైపు ఏర్పాట్లు వేగంగా జరుగుతుంటే.. మరోవైపు వివాదాలు చుట్టుముడుతున్నాయి. మరి ఆ రోజున ఏం జ‌రుగుతుందో చూడాలి.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago