Suman : ఒకప్పటి స్టార్ హీరో సుమన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన నటించిన సినిమాలు మంచి విజయాలు కూడా సాధించాయి. నీచల్ కులం అనే తమిళ సినిమా ద్వారా యాక్టింగ్ లోకి అడుగుపెట్టిన ఆయన సుమన్ గత 45 సంవత్సరాలుగా నటుడిగా కొనసాగుతున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ భాషల్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.1990లో అగ్ర హీరోగా రాణించిన సుమన్ యాక్షన్ సినిమాలతో పాటు భక్తి చిత్రాలతో మెప్పించి అలరించారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. రాజకీయాలలోకి కూడా రానున్నాడని చెబుతున్నారు.
సుమన్ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే పొలిటికల్ కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు. తెలంగాణాలో తాను బిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తానని సుమన్ ఓపెన్ గా కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయింది. అలానే కొంతకాలంగా తన కుమార్తె గురించి వస్తున్న రూమర్స్ పై సుమన్ స్పందించారు. సౌత్ ఇండియాలో ఓ స్టార్ హీరో కుమారుడితో సుమన్ కుమార్తె వివాహం జరగబోతున్నట్లు కొంతకాలంగా ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో సుమన్ స్పందించారు. నా కుమార్తె పేరు అఖిలజ ప్రత్యూష. ఆమె హ్యూమన్ జెనెటిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది. ఆమె ఓ స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళుతుంది అనే వార్తల్లో వాస్తవం లేదు.
నా కుమార్తెకి పెళ్లి చేసే ఆలోచన ఉంది. కానీ ఇప్పుడే కాదు. ఆమె చదువు పూర్తయ్యాకే నిర్ణయం తీసుకుంటా. తనకి నటనపై ఆసక్తి లేదు అని కూడా సుమన్ క్లారిటీ ఇచ్చారు. అప్పట్లో సుమన్ ఒక వివాదంలో చిక్కుకోవడం అతడి కెరీర్ కి పెద్ద మైనస్ గా మారగా, ఆ తర్వాత నిదానంగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. విలన్‌గా తన సత్తా చూపించాడు.శివాజీ చిత్రంలో విలన్ పాత్ర, అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్ర సుమన్ కి సరికొత్త ఇమేజ్ తీసుకువచ్చాయి అనే చెప్పాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…