సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం కాంతార. ఈ సినిమా ఇంటా బయట క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతాకాదు. సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవటమే కాకుండా కలెక్షన్స్ పరంగానూ దుమ్ము రేపింది. ఈ సినిమాలో కర్ణాటకలోని తుళునాడులో ఉన్న సంస్కృతులను అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా.. అక్కడి ‘భూతకోల’ సంప్రదాయం సినిమాకి ఆయువుపట్టుగా నిలవగా, చిత్రం క్లైమాక్స్‌లో కోల చెప్పే వ్యక్తిగా రిషబ్ శెట్టి నట విశ్వరూపం చూపించారు. ఇక ఈ సినిమాలో వరాహ రూపం పాటకి వాడిన మ్యూజిక్ మాదే, మా మ్యూజిక్ ని కాపీ కొట్టారు, లీగల్ నోటీసులు పంపిస్తాం అంటూ కర్ణాటకకు చెందిన ‘తైక్కుడం బ్రిడ్జ్’ అనే ఓ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
కోర్టులో కూడా పిల్ వేయగా విచారించిన కోర్టు దీనిపై తీర్పునిస్తూ కాంతార టీంకి షాకిచ్చింది. ఇప్పుడు సినిమాలోని వరాహ రూపం పాటను అమెజాన్, యూట్యూబ్, స్పాటిఫై, వింక్ మ్యూజిక్, జియోసావన్ మరియు ఇతర మ్యూజిక్ ప్లాట్ ఫామ్ స్ పై ప్లే చేయడం పై నిషేధం విధించారు. తైక్కుడం వారి నవరసం పాట ఒక క్లాసికల్ పాట. ఇది కేరళ యొక్క ప్రసిద్ధ కళారూపమైన కథాకళికి నివాళిగా చెప్తారు. కాంతారలోని వరాహ రూపం పాట కూడా దక్షిణ కర్ణాటక లోని కొందరి నమ్మకాలకు అద్దం పట్టేలా ఉంటుంది.
రెండు పాటల మధ్య సిమిలారిటీ ఎక్కువగా ఉందని, ఇది కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొంటూ, బ్యాండ్ ఇంతకుముందు చెప్పింది కానీ ఇప్పుడు కోర్టు లో కేస్ వల్ల పాట పై నిషేదం ఏర్పడింది . కోర్టు ఆర్డర్స్‌తో మెయిన్ ఫ్లాట్ ఫామ్స్‌లో వరాహ రూపం పాటను నిలిపి వేయబోతున్నారు. కన్నడలో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన హోంబలే ఫిలింస్ బ్యానర్‌లో కాంతార సినిమా తెరకెక్కింది. 20 కోట్లతో తీసిన ఈ సినిమాకి ఇప్పటికే దాదాపు 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…