నరుడు దృష్టి తగిలితే నల్లరాయినైనా బద్దలై పోతుందని అంటారు పెద్దలు. ఈ విషయాన్ని చాలామంది నమ్ముతూ ఉంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా నరదృష్టి బారిన పడతారని పండితులు వెల్లడిస్తున్నారు. ఒక వ్యక్తి సంపాదనపరంగా గాని, ఉద్యోగపరంగా గాని అభివృద్ధి చెందుతున్న టైం సమయంలో చిక్కులు ఏర్పడితే నీకు నరఘోష ఎక్కువగా ఉందని, అందుకే నీకు ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయని చెబుతూ ఉంటారు. మరి ఇలాంటి నరదృష్టి నుంచి తప్పించుకొని సంపాదనపరంగా అభివృద్ధి చెందాలి అంటే నిమ్మకాయ బాగా సహాయపడుతుందని జ్యోతిష్య పండితులు వెల్లడిస్తున్నారు.
మరి జ్యోతిష్య పండితులు నిమ్మకాయని ఉపయోగించి నరఘోష నుంచి ఎలా తప్పించుకోవాలి అనే విషయంపై ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం.. మనం నిమ్మకాయను చాలా రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి మనిషిలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుందని అందరికీ తెలిసిన విషయమే. నిమ్మకాయలను అందం, ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఉపయోగిస్తారంటే అతిశయోక్తి కాదు.
అదేవిధంగా నిమ్మకాయకు దృష్టి దోషాలను, అతీత శక్తులను నివారించే పాజిటివ్ ఎనర్జీ ఉందని చాలామంది నమ్మకం. మనలో చాలామంది చాలాసార్లు ఈ విషయాన్ని గమనించే ఉంటాం.. ఏదైనా దుకాణానికి వెళ్ళినప్పుడు వ్యాపార ప్రదేశాలలో ఒక గ్లాసు నీటిలో నిమ్మకాయని వేసి టేబుల్ మీద పెట్టుకోవడం మీలో చాలామంది చూసే ఉంటారు. ఆ సమయంలో అనేక ప్రశ్నలు మనల్ని చుట్టుముట్టేస్తాయి. ఇలా నిమ్మకాయను ఎందుకు పెట్టారు అనే విషయంపై మీకు ఎప్పుడన్న ప్రశ్న తలెత్తిందా..? నిమ్మకాయ వాస్తు పరంగా ఎలాంటి మంచి ఫలితాలు కలిగిస్తుందో అన్న విషయంపై జ్యోతిష్య పండితులు ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం.
ఒక గాజు గ్లాస్ నీటిలో నిమ్మకాయని వేసి ఉంచడం వలన ఆ ప్రాంతంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఆ నిమ్మకాయ గ్రహించి పాజిటివ్ ఎనర్జీ ని విడుదల చేస్తుంది. తద్వారా నిమ్మకాయ ఉన్న ప్రదేశంలో సంపాదన అనేది అభివృద్ధి చెందుతుంది. ఇలా వ్యాపార ప్రదేశంలోనే కాదు.. ఇంటిలో కూడా గాజు గ్లాసు నీటిలో నిమ్మకాయని వేసి ఉంచడం వల్ల ఇంటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి ఆర్థిక సమస్యలు తగ్గి లక్ష్మీ కటాక్షం కలిగి సంపద అనేది పెరుగుతుంది. అదేవిధంగా నరదృష్టి ఎక్కువగా ఉన్న వ్యక్తిని నిలబెట్టి, ఆ వ్యక్తిని చూస్తూ పైనుంచి కింద వరకు నిమ్మకాయను దిష్టి తీయడం ద్వారా నరఘోష అనేది పోతుందని, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఆనందంగా ఉంటారని జ్యోతిష్య పండితులు వెల్లడిస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…