Kantara Movie : ఓ కన్నడ సినిమా గత కొద్ది రోజులుగా దేశం మొత్తాన్ని ఊపేస్తుంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా పెద్ద హిట్ అందుకుంది. ఆ సినిమా మరేదో కాదు కాంతార. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. నవంబర్ 24 నుంచి కాంతార చిత్రం అమెజాన్ ప్రై మ్ లో కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.
బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఇప్పుడు మాత్రం కొంత నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో కాంతార మేకర్స్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమాలోని క్లైమాక్స్‌తో పాటు .. వరాహరూపం పాట వలనే సినిమా చాలా హిట్ అయింది. అయితే ఓటీటీకి వచ్చే సరికి కాంతార సినిమాలోని వరహరూపం పాటను తొలగించిన సంగతి తెలిసిందే. థియేటర్లలోనే కాదు..అటు ఓటీటీలోనూ ఈ సాంగ్ వినిపించడం లేదు. దీంతో సినిమాపై ఆసక్తి తగ్గింది.
మరోవైపు క్లైమాక్స్ తప్ప మిగతా సినిమా అంతా ఇదివరకే ఎన్నో సినిమాలలో చూసినట్లే ఉందని.. తెలుగులో రంగస్థలం సినిమా లైన్ నే కాంతార మాదిరిగా చూపించారని, సాంగ్స్ వరకు కొంత ఒకే కాని కథా కథనాలు కొత్తగా లేవని చాలా ల్యాగ్ అనిపిస్తుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వరాహ రూపం సాంగ్, భూతకోల సంప్రదాయం, క్లైమాక్స్ మినహాయిస్తే ఈ సినిమా అస్సలు బాగోలేదంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అంతా అయిపోయాక ఇప్పుడు ఎన్ని విమర్శలు చేస్తే ఏం లాభం. మూవీకి మంచి కలెక్షన్స్ రాబట్టడంతో పాటు జనాలనందరిని థియేటర్స్‌కి రప్పించింది. ఇప్పుడు నెగెటివ్ కామెంట్స్ చేస్తే ఏం ఉపయోగం అని కొందరు అంటున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…