రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన కన్నడ బ్లాక్‌బస్టర్ కాంతారా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఒక్కోసారి ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని అద్భుతాలు జరిగిపోతుంటాయి. అలాంటి అద్భుతమైన వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది కార్తికేయ 2, ఆ తర్వాత కన్నడలో కాంతారా. చినుకు చినుకు గాలి వాన అయినట్టు.. కన్నడలో చిన్న సినిమాగా మొదలైన కాంతారా ప్రభంజనం ఇపుడు తెలుగుతో పాటు ఉత్తారాది ప్రేక్షకులను కూడా ఫిదా చేస్తోంది. అక్కడ ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..
తెలుగులో కాంతార రూ. 2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటి 2.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 16.51 కోట్ల రాబట్టింది. మొత్తంగా రూ. 14.21 కోట్ల లాభాలను సంపాదించింది. అంటే పెట్టిన పెట్టుబడికి నాలుగింతలు లాభాలను తీసుకొచ్చింది. ఇంకా ఈ చిత్రం ముందు ముందు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఇక హిందీలో ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 31.70 కోట్ల వసూళ్లను రాబట్టి అక్కడ కూడా సత్తా చాటుతోంది. 16 కోట్లు పెట్టి తీసిన సినిమా ఓవరాల్‌గా రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లతో సత్తా చాటుతోంది. రిషబ్ శెట్టి పేరు కాంతారాతో దేశవ్యాప్తంగా మారు మోగిపోతూనే ఉంది.
కాంతార ది లెజెండ్ అంటూ కర్ణాటకలో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా అక్కడ జానపద కళ మన దగ్గర భూత కోలం (సిగమూగే) ను ఎంతో చక్కగా తెరపై ఆవిష్కరించాడు. ఈ సినిమా షూట్ రిషబ్ శెట్టి వాళ్ల సొంత ఊర్లో జరపడం విశేషం. కాంతార సినిమాను కేజీయఫ్ వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్ని నిర్మించిన విజయ్ కిరగందూర్ హోంబలే ఫిలింస్ లో నిర్మించారు. సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అయిందని రిషబ్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…