Kantara Movie : కన్నడ చిత్రం కాంతారా బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. దర్శకుడు అలాగే హీరోగా రిషబ్ శెట్టి చేసిన ఈ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకొని కన్నడ సహా తెలుగు మరియు హిందీ ఆడియెన్స్ నుంచి కూడా మంచి వసూళ్లు రాబడుతుంది. తెలుగులో అయితే సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంటుంది.. ఇండియన్ మూవీ డేటా బేస్.. ఐఎండీబీలో కాంతారా చిత్రం నెంబర్ వన్ స్థానంలోకి వచ్చింది. టాప్ 200 సినిమాల్లో.. కాంతారా నెంబర్ వన్ స్థానంలోకి వచ్చింది. కేజీయఫ్ 128, ఆర్ఆర్ఆర్ 190, బాహుబలి 101వ స్థానంలో ఉన్నాయి. అలా ఈ చిత్రాలన్నింటిని కాంతారా వెనక్కి నెట్టేసింది.
చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయగా, ఆయనకు లాభాల పంట పండిస్తుంది. అయితే ఈ సినిమా ఒకవైపు థియేటర్స్‌లో సందడి చేస్తుండగానే, మూవీకి సంబంధించిన ఓటీటీ డేట్ ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తుంది. నవంబర్ 4 శుక్రవారం నాడు ‘కాంతార’ ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు ముందస్తు సమాచారం. ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని ఫిలిం నగర్ టాక్. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
ఇక అరవంద్ సొంత స్ట్రీమింగ్ ఆహా కూడా ఉండడంతో అమెజాన్‌తో పాటు ఆహాలోను స్ట్రీమింగ్ కానుందనే ప్రచారం ఒకటి నడుస్తుంది. కన్నడలో వంద కోట్లు కలెక్ట్ చేసిన అతి కొద్ది చిత్రాల్లో కాంతారా నిల్చుంది. కాంతారా దెబ్బకు కేజీయఫ్ రికార్డులు సైతం బద్దలయ్యాయి. కన్నడలో ఈ చిత్రం కేవలం రెండు వారాల్లోనే వంద కోట్లు కొల్లగొట్టేసింది. పైగా ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలిస్తే అంతా షాక్ అవ్వాల్సిందే. కనీసం ఇరవై కోట్లు కూడా పెట్టని ఈ సినిమాకు కేవలం కన్నడలోనే వంద కోట్లు వచ్చాయి. ఇది అందరిని ఆశ్చర్యపరుస్తుంది.